Oil and Natural Gas Corporation Limited (ONGC) Scholarship to Meritorious Students

ఓఎన్జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్షిప్పులు మహిళలకు దక్కుతాయి. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ (ఈడబ్ల్యుఎస్)ల్లో ప్రతిభావంతులైన పేదలకు

అర్హత: ఏదైనా విద్యాసంస్థలో పుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2024-25 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు ఉండొచ్చు.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా: ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీ మార్కులతో స్కాలర్షిప్పులు మంజూరు చేస్తారు.

స్కాలర్షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ,జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

కోర్సులవారీగా ఎన్ని?

ఇంజినీరింగ్: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్

ఎంబీబీఎస్: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్

ఎంబీఏ:140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్

జియాలజీ/ జియోఫిజిక్స్: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్.

దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి. నిబంధనలు 

వేరే ఏ స్కాలర్షిప్పులూ మంజూరు కానివాళ్లే ఓఎన్ జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఎంపికైనవారి వివరాలను ఓఎన్సీసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. పైన తెలిపిన కోర్సుల్లో రెగ్యులర్ విధానంలో భారత్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు: ఓఎన్ జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదుచేయాలి. వయసు, కుల ధ్రువీకరణ, పదో తరగతి మార్కులు, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కులు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, కాలేజీ ఐడీ, ప్రవేశ వివరాలు.. ఈ పత్రాలన్నీ అందించాలి.


చివరి తేదీ: సెప్టెంబరు 18

ONGC Scholarship Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top