Key Points On Firki Maths TPD Blended Course
ఈ శిక్షణ కేఆర్పీ లకు సెప్టెంబర్ 20న మొదలు అయ్యి, నవంబర్ 8వ తేదీ తో ముగుస్తుంది.
ట్రైనీ (3,4,5 తరగతుల) టీచర్లకు సెప్టెంబర్ 26న మొదలు అయ్యి, నవంబర్ 23వ తేదీ తో ముగుస్తుంది.
ఈ కోర్సును ఫిర్కీ మొబైల్ యాప్ ద్వారా కానీ, firki.co వెబ్సైట్ ద్వారా కానీ పూర్తి చేయవచ్చును.
దీనికి యూజర్ నేమ్ Registered number మరియు పాస్వర్ద్ tpd@2024
ఉదాహరణకు:
User ID: 98490XXXXX
Psw: tpd@2024
మొబైల్ యాప్ లో హ్యాట్ సింబల్ మీద/ వెబ్సైట్ లో My Programes మీద క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ కనబడుతుంది.
ఈ కోర్స్ లో ఒక యాక్టివిటీ పూర్తి చేస్తేనే తరువాతి యాక్టివిటీ ఓపెన్ అవుతుంది.
కోర్స్ లో మొదటగా Pre Test – 13 ప్రశ్నలకు సమాధానలు సబ్మిట్ చేసి పూర్తి చేయాలి.
ఒక అటెంప్ట్ కు మాత్రమే అవకాశం. మార్కులు తక్కువ వచ్చాయని మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఉండదు.
Pre Test పూర్తి చేశాక Module-1 ఓపెన్ అవుతుంది.
Module-1 అనేది కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారలకు సంబంధించినది.
Module-1 లో నాలుగు యూనిట్లు కలవు. ప్రతి యూనిట్ లో వీడియోలు ఉంటాయి.
ఈ వీడియోలను చూస్తూ, మధ్యలో డిస్ప్లే అయ్యే ప్రశ్నలకు సమాధానాలు సెలెక్ట్ చేసుకోవాలి.
Note: దీక్షా యాప్ లో వీడియోలను చివరకు డ్రాగ్ చేసినట్లు, ఈ యాప్ లో కుదరదు. పూర్తిగా వీడియో చూడవలసినదే. కాకపోతే, వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.
Module-1 హ్యాండ్ ఔట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హ్యాండ్ ఔట్ మీద రెండు ప్రశ్నలను క్విజ్ రూపం లో అడుగుతారు.
Module-1 సమ్మరీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Module-1 మీద 10 ప్రశ్నలతో క్విజ్ ఉంటుంది.
Module-1 లో క్విజ్ వరకు మాత్రమే మీరు ఇప్పటి వరకు పూర్తి చేయగలిగేది.
క్విజ్ తరువాత PLC Assignment అనేది October 16వ తేదీ తర్వాత మాత్రమే ఓపెన్ చేయబడుతుంది.
అప్పటి వరకు కోర్స్ పూర్తి చేయడానికి ఉండదు.
PLC Assignment మీద ఫీడ్ బ్యాక్, Module-1 మీద ఫీడ్ బ్యాక్ పూర్తి చెయడంతో Module-1 పూర్తి అవుతుంది.
తదుపరి, ఇదే క్రమంలో Module-2 ను కూడా పూర్తి చేయవలసి ఉంటుంది
0 comments:
Post a Comment