Eenadu Journalism School Notification 2024 - Online Application Form

Eenadu Journalism School Notification 2024 - Online Application Form

ఎంపిక:

అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే.

కొత్త తరం

పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.

Join Our Free Social Media Educational Free Alerts Groups:

Join Our Telegram Andhra Teachers Channel Click Here

Join Our Whatsapp Andhra Teachers Channel Click Here

మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్ని వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.


Eenadu Journalism School Notification 2024 - Online Application Form

శిక్షణా మరియు జీతం

ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు ₹14,000, తరువాతి ఆరు నెలలు 

* 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.

ఉద్యోగంలో:

స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్ధులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో ₹19,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్లో ₹21,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్లో ₹23,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి www.eenadu.net, pratibha.eenadu.net/ eenadupratibha.net లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు రుసుము ₹200 ఆన్లైన్లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఒప్పంద పత్రం:

స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.

అర్హతలు:

తేట తెలుగులో రాయగల నేర్పు

• ఆంగ్లభాషపై అవగాహన

• లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు

• ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన

• మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష

వయస్సు: 09.12.24 నాటికి 28/సంవత్సరాల  మించ రాదు

అర్హత : డిగ్రీ

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ : 15.09.2024

ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు 13.10.2024

ప్రవేశ పరీక్ష: 27.10.2024

కోర్సు ప్రారంభం : : 09.12.2024

ఈ సూచనలను క్షుణ్ణంగా చదివిన తరువాతనే దరఖాస్తును పూర్తి చెయ్యండి.

* దరఖాస్తులోని ఖాళీలన్నింటినీ ఆంగ్ల భాషలో 'CAPITAL LETTERS' తో నింపాలి.

* పదానికి పదానికి మధ్య ఖాళీ వదలాలి.

* మీ విద్యార్హతల ధృవీకరణ పత్రాల నకళ్లను మేం కోరినప్పుడు మాత్రమే సమర్పించాలి.

1. మొదటి వరుసలో ఇంటి పేరును మాత్రమే రాయాలి. రెండో వరుసలో 'NAME'కి ఎదురుగా పేరును రాయాలి. పేరులో ఒకటి కన్నా ఎక్కువ పదాలుంటే ఒక్కో పదానికీ మధ్య ఖాళీని వదలండి. ఒకవేళ పేరు మరీ పొడుగ్గా ఉంటే మొదటి భాగాలను పొడి అక్షరాల్లో రాయండి. ఉదాహరణకు మీ పేరు వీరవెంకట సత్యసాయి మోహన కృష్ణ వరప్రసాద్ అయితే VVS SM K VARA PRASAD అని రాయవచ్చు.

2. ఈ వరుసలో మీ తండ్రి లేదా భర్త లేదా సంరక్షకుని పేరు రాయండి.

3. 'POSTAL ADDRESS' ఎదురుగా మీ పూర్తి చిరునామా రాయండి. ఇక్కడ మళ్ళీ మీ పేరు రాయనవసరం లేదు. పిన్కోడ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను వాటికి ఎదురుగా ఉన్న ఖాళీల్లో నింపాలి.

4. ఈనాడు జర్నలిజం స్కూలు మూడు కోర్సుల్ని అందిస్తోంది.

1. పీజీ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం

2. పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం

3. పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం

మీరు ఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్నారో ఇక్కడ ఎంపిక చేసుకోవాలి.

5. మీరు ఈనాడు గ్రూపులో న్యూస్ కంట్రిబ్యూటర్గా పనిచేస్తుంటే News Contributorను, ఉద్యోగి అయితే Employeeను, అప్రెంటీస్ అయితే Editorial Apprenticeను, ఇప్పటివరకూ ఎలాంటి అనుబంధం లేకుంటే Not Applicable .

6. మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాలు తెలియజేయాలి.

7. పురుషులైతే Maleను, స్త్రీ అయితే Femaleను ఎంచుకోవాలి.

8. మీరు వివాహితులైతే Marriedను, అవివాహితులైతే Unmarriedను గుర్తించండి.

9a మీ విద్యార్హత డిగ్రీ/పీజీ/ ఎంఫిల్ లేదా పీహెచ్ఎ.. ఇక్కడ గుర్తించాలి.

9b. డిగ్రీలో మీరు సాధించిన మార్కుల శాతాన్ని రాయాలి.

9c జర్నలిజంలో మీకున్న విద్యార్హతను ఇక్కడ గుర్తించండి. జర్నలిజంలో మీకు ఎలాంటి విద్యార్హత లేకపోతే Not Applicableను ఎంచుకోండి.

9d. మీకు తెలుగు టైపింగ్ తెలిసి ఉంటే 'Yes' ను, తెలియకపోతే 'No' ను గుర్తించండి.

9e మీరు డిగ్రీ తెలుగు మాధ్యమంలో చదివి ఉంటే 'Telugu'ను, ఇంగ్లిషు మాధ్యమంలో చదివి ఉంటే English'ను ఎంచుకోవాలి.

10. ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశం కోసం మీరింతకు ముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో తెలియజేసే అంకెను ఈ గడిలో వేయాలి.

11. మీ కుటుంబ వార్షికాదాయం ఏ కేటగిరీలో ఉందో పేర్కొనండి.

12. మీకు అనుకూలంగా ఉండే 3 పరీక్ష కేంద్రాల ప్రాధాన్యక్రమాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు అనంతపురంలో పరీక్ష రాయడం మీకు అత్యంత అనువుగా ఉంటుందనుకుంటే Choice 1కు ఎదురుగా Anantapuramను ఎంచుకోవాలి. కర్నూలు, కడపల్లో రాయడానికి మీరు రెండో, మూడో ప్రాధాన్యం ఇస్తే Choice 2, Choice 3 0 2 Kurnool, Kadapa

13. దరఖాస్తు రుసుము రూ.200/- లను ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. వేరే రూపంలో స్వీకరించబడవు.

* దరఖాస్తు సమర్పిస్తున్న వారు తమ పాస్పోర్ట్ సైజు డిజిటల్ ఫొటోను 'JPEG' ఫార్మాట్లో దరఖాస్తుకు అటాచ్ చేయాలి. ఫొటో సైజు 50kbకి మించకూడదు.

* I agree to pay the Exam Fee Rs. 200 బాక్స్లో చేయండి. అన్ని వివరాలు నింపిన తరువాత ఓసారి సరిచూసుకుని Apply' చేయండి. దరఖాస్తు ముద్రిత ప్రతి నకలుని అభ్యర్థులు తమ వద్ద కూడా ఉంచుకోవాలి.


Online Application

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top