కేంద్ర ఆర్థిక వ్యవహరాల శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో అత్యంత ఆదరణ పొందిన సుకన్య సమృద్ధి యోజన (SSY) కూడా ఉంది. ఈ కొత్త రూల్స్ 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొత్త నిబంధనల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఇప్పటివరు మనవరాలి ఆర్థిక భద్రత కోసం గ్రాండ్ పేరెంట్స్ కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేస్తున్నారు. ఆ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.
అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సకన్య సమృద్ధి యోజన ఖాతాను చట్టపరంగా తల్లిదండ్రులు లేదా సంరక్షులు మాత్రమే తెరవాలి. గ్రాండ్ పేరెంట్స్ కు ఆ అధికారం లేదు. సుకన్య సమృద్ధి ఖాతాల్లో లోటుపాట్లను సరి చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ కు ఇకపై బాలిక పేరు మీద సుకన్య సమృద్ధి ఖాతా తెరిచే అధికారం ఉండదు.
మనవరాలి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు ఆ ఖాతాను తల్లిదండ్రుల పేరు మీదికి బదిలీ చేయాలి. లేక పోతే పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అందవు. మరి ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దాం.
ఏయే పత్రాలు కావాలంటే..
ఒరిజినల్ అకౌంట్ పాస్ బుక్ కలిగి ఉండాలి. ఇందులో ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి.
బాలిక జనన ధ్రవీకరణ ఫత్రం ఉండాలి. ఇందులో ఆమె వయసు, రిలేషన్ వివరాలు ఉంటాయి.
బాలికకు ఖాతా తెరిచినవారు ఏమవుతారో తెలియేజేసేందుకు బర్త్ సర్టిఫికేట్ లేదా లీగల్ డాక్యుమెంట్ ఉండాలి.
0 comments:
Post a Comment