NPCI Launches UPI Circle: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫాంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా ఒకరి యూపీఐ అకౌంట్ వేరొకరు వాడుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ.. యూపీఐ సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను డెలిగేట్ పేమెంట్స్‌గా పేర్కొంటూ.. తాజాగా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.. దీని బెనిఫిట్స్ ఏంటి.. ట్రాన్సాక్షన్లపై ఎలాంటి పరిమితులు ఉన్నాయనేది తెలుసుకుందాం.
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉంటే.. వారి మొబైల్స్‌లో యూపీఐ సేవల్ని వాడుకోవచ్చు. అయితే ఎవరికి వారికి సెపరేట్‌గా యూపీఐ ఐడీ ఉంటుంది. మరొకరు వాడుకోరాదు. అయితే కొత్తగా తెచ్చిన సర్కిల్ ఫీచర్ మాత్రం ఇందుకు అనుమతిస్తుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్‌ను కుటుంబసభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటు అందిస్తుంది. దీంతో.. ఒకరి బ్యాంక్ అకౌంట్‌ను మరొకరు వాడి ట్రాన్సాక్షన్ చేయొచ్చన్నమాట.
>> కుటుంబసభ్యుల్లో ఎవరైనా బయటికి వెళ్లిన సమయంలో.. వారి ట్రాన్సాక్షన్స్ కోసం ఈ ఫీచర్ వాడొచ్చు. లేదా స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలకు వారి ఖర్చుల కోసం కూడా మీ యూపీఐ ఖాతా షేర్ చేసుకునే వీలుంటుంది. ఇంటి ఖర్చుల్ని ట్రాక్ చేసేందుకు.. అంతా ఒకే బ్యాంక్ అకౌంట్ వినియోగించేందుకు కూడా ఇది ఉపయోగపడతుందని చెప్పొచ్చు. బ్యాంక్ అకౌంట్ లేనందున.. ఇప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వారి కోసం ఈ ఫీచర్ తెచ్చినట్లు NPCI తెలిపింది. యూపీఐ యాప్స్ సహా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అతి త్వరలో ఈ ఫీచర్ ప్రవేశపెట్టనున్నాయి
> ఇక దీనిని ఎలా వాడాలంటే.. డెలిగేట్ పేమెంట్ కోసం.. ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఒక మ్యాండేట్ క్రియేట్ చేయాలి. తన కాంటాక్టుల నుంచి నచ్చిన నంబర్లను ఎంచుకోవచ్చు. ప్రైమరీ యూజర్ గరిష్టంగా మరో ఐదుగురిని సెకండరీ యూజర్లుగా ఎంచుకోవచ్చు. ప్రైమరీ యూజర్‌కు అన్ని అధికారాలు ఉంటాయి. నగదు, వినియోగంపై పరిమితి పెట్టొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 15 వేల వరకు వాడుకోవచ్చు. గరిష్టంగా 5 వేల వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సెకండరీ యూజర్ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైనా.. ప్రైమరీ యూజర్ యూపీఐ, బ్యాంక్ అకౌంట్లో తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment