ఉస్మానియా వర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2024 -25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. http://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉస్మానియాలో దూర విద్య ప్రవేశాలు 2024
Osmania University Distance Education : ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు(ఫస్ట్ ఫేజ్) దరఖాస్తులు కోరుతూ కొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది. ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
యూనివర్శిటీ - ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా వర్శిటీ
కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.
కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం.
మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.
సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.
అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్ ఐసెట్/ ఏపీఐసెట్ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - ఆగస్టు 16, 2024.
అధికారిక వెబ్ సైట్ - http://www.oucde.net/
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు...
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మొదటగా http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు.
కేయూ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్:
మరోవైపు వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఉంది.
ముఖ్య వివరాలు:
ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ.
యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php
మెయిల్ - info@sdlceku.co.in
Download Complete Notification
0 comments:
Post a Comment