08-12-2024 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in తేదీ 05-08-2024 నుండి. పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 06-09-2024. నమోదు చేసే సమయంలో విద్యార్ధి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయవలెను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్ధులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్ధులకు రూ. 50/-. పరీక్ష రుసుమును ఆన్లైన్ అప్లికేషన్ లో ఇవ్వబడిన SBI Collect లింకు ద్వారా మాత్రమే చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
* నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2024-25
ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్షిప్ అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు మొత్తం నాలుగేళ్ల పాటు ఉపకారవేతనం లభిస్తుంది.
అర్హతలు:
* ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
* ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
* విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
0 comments:
Post a Comment