ISRO ప్రస్తుత టెక్ వరల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ఆధిపత్యం మరింత పెరగనుంది
ఏఐ, ఎంఎల్ విభాగాలపై పట్టు సాధించిన వారికి మంచి ఉద్యోగవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఇస్రో, ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
ఇస్రో AI, ML టెక్నాలజీపై ఐదు రోజుల ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును ఆగస్టు 19 నుంచి ప్రారంభించనుంది. IIRS ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా విద్యార్థులను ప్రోత్సహించనుంది. ఇస్రో 2017లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా ఒక్కో అంశంపై ఉచిత కోర్సును అందిస్తోంది. ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఇస్రో 3,500 పైగా నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు విస్తరించింది. జియోస్పేషియల్ టెక్నాలజీ, దాని అప్లికేషన్లలో కెపాసిటీ బిల్డింగ్‌ను ప్రోత్సహించడంలో ఈ ప్రోగ్రామ్ కీలకపాత్ర పోషిస్తోంది.
అర్హత ప్రమాణాలు
ఇస్రో ఐదు రోజుల ఉచిత కోర్సు కోసం సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు షెడ్యూల్
ఆగస్టు 19 నుంచి 23 మధ్య ఈ కోర్సును ఇస్రో షెడ్యూల్ చేసింది. ఇ-క్లాస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లెక్చర్ స్లైడ్స్, వీడియో రికార్డెడ్ లెక్చర్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, డెమాన్‌స్ట్రేషన్ హ్యాండ్‌అవుట్స్ ద్వారా కోర్సును డెలివరీ చేస్తారు. ఆన్‌లైన్ లెక్చర్స్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయి.
ఆగస్టు 19న AI/ML, DL ఇంట్రడక్షన్ ఉంటుంది. డాక్టర్ పూనమ్ సేథ్ తివారీ లెక్చర్ ఇస్తారు. ఆగస్టు 20న మెషీన్ లెర్నింగ్ మెథడ్స్‌పై కాస్ల్, డాక్టర్ హీనా పాండే లెక్చర్ ఉంటుంది. ఆగస్టు 21న డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, అప్లికేషన్స్‌పై డాక్టర్ పూనమ్ సేథ్ తివారీ లెక్చర్ ఉంటుంది. ఆగస్టు 22న గూగుల్ ఎర్త్ ఇంజిన్ త్రూ మెషిన్ లెర్నింగ్ టాపిక్ ఉంటుంది. దీనిపై డాక్టర్ కమల్ పాండే క్లాస్ నిర్వహిస్తారు. ఆగస్టు 23న పైథాన్ ఫర్ మెషిన్/డీప్ లెర్నింగ్ మోడల్స్ అనే టాపిక్‌పై రవి భండారి క్లాస్ ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్
ఈ ఉచిత ఆన్‌లైన్ కోర్సు కోసం అభ్యర్థులు ఇస్రో పోర్టల్ విజిట్ చేయాలి. మొదటగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆమోదం ఆటోమెటిక్‌గా జరుగుతుంది. నోడల్ సెంటర్ ద్వారా కోఆర్డినేటర్ ఆమోదంతో కూడా ఈ కోర్సు కోసం రిజిస్టర్ కావచ్చు. అప్లికేషన్ ఆమోదం పెండింగ్‌లో ఉంటే, సంబంధిత నోడల్ సెంటర్ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలి.
సర్టిఫికేట్ అవార్డు
ఇస్రో ఆన్‌లైన్ ఉచిత కోర్సులో పాల్గొనే అభ్యర్థుల హాజరు కనీసం 70 శాతం ఉండి, కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే ఆ తరువాత కోర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. ఈ సర్టిఫికేట్‌ను ISRO లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Job Notifications Telegram Channel:
Job Notifications YouTube ఛానల్ లో చేరండి
https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_
0 comments:
Post a Comment