BSNL 5G SIM: దేశంలోని ప్రైవేటు టెలికాం ఆటగాళ్లకు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు ముందుకు సాగుతోంది బీఎస్ఎన్ఎల్ ప్రస్థానం. గతంలో మాదిరిగా కాకుండా కోరుకున్న నంబర్ ఇంటివద్దకే వచ్చేలా ప్రభుత్వ సంస్థ ఏర్పాట్లు చేసింది.
ప్రస్తుతం సిమ్ హోమ్ డెలివరీ సేవలను జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన 4G సేవలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర ఆటగాళ్లను పోటీలో ఎదుర్కొనేందుకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటంపై కూడా ఫోకస్ పెట్టింది. అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు, వచ్చే ఏడాది నాటికి 21 వేల 4G నెట్‌వర్క్ టవర్ల ఏర్పాటు పూర్తవుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే 5జీ సేవల కోసం ప్రస్తుతం ఉన్న టవర్లలో అవసరమైన సాంకేతిక మార్పులు చేసేందుకు కసరత్తులు మెుదలయ్యాయని సమాచారం.
గతనెలలో దేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేషర్లైన Jio, Airtel, Vi తమ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. దీనిపై చాలా మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ఘర్ వాపసీ అంటూ తిరిగి బీఎస్ఎన్ఎల్ కు తిరిగి రావాలనుకుంటున్నట్లు నెట్టింట పేర్కొన్నారు. ఈ క్రమంలో జులై 2024లో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కొత్త సబ్‌స్క్రైబర్లను సైతం పెంచుకుంది. ఆ సమయంలో దాదాపు 2 లక్షలకు పైగా కొత్త సిమ్ కార్డులను జారీ చేసింది. ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్న వేళ వారికి వేగంగా సిమ్ కార్డులను జారీ చేసేందుకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే వారి ఇంటికి నేరుగా డెలివరీ ఇచ్చే సౌలభ్యాన్ని తెచ్చింది.
2జీ స్కామ్ తర్వాత ఒక్కసారిగా కుదేలైన ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ ప్రస్తుతం టాటాల సహకారంతో వేగంగా నిర్మించబడుతోంది. బీఎస్ఎన్ఎల్ ప్రూనే అనే కంపెనీ సహకారంతో సిమ్ కార్డ్‌లను ఇంటికి డెలివరీ చేయడం ప్రారంభించింది. ప్లే స్టోర్ నుంచి ప్రూన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు. ఆర్డర్ పెట్టిన 90 నిమిషాల్లోనే సిమ్ డెలివరీ ఉంటుందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment