ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? - kotak kanya scholarship 2024

 Kotak Kanya Scholarship 2024 Details: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పేద బాలికల ఉన్నత విద్య కోసం "కోటక్​ కన్య స్కాలర్​షిప్"​ను అందిస్తోంది కోటక్​ మహీ. ఈ స్కాలర్​షిప్ కింద ప్రతి బాలికకు ఏడాదికి రూ.1.5లక్షల ఆర్థిక సహాయం అందిచనుంది. ఈ స్కాలర్​షిప్​ను విద్యార్థిని.. తన కోర్సు పూర్తి చేసే వరకు ఇస్తారు. బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించే విధంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మొత్తాన్ని బాలికలు.. ల్యాప్​టాప్​ లేదా తమ హాస్టల్​, ట్యూషన్​, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చని వివరించింది. అయితే, ఈ స్కాలర్​షిప్​ను కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి మాత్రమే అందజేస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్కాలర్​షిప్​నకు ఎవరు అర్హులు?

దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు అందరూ అర్హులు.ఇంటర్‌లో 75శాతానికి మించి మార్కులు సాధించి ఉండాలి.బాలిక కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.దేశంలోని NIRF/NAAC సంస్థలతో గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, MBBS, BDS, ఇంటిగ్రేటెడ్ LLB (5 సంవత్సరాలు), B.ఫార్మసీ, B.Sc వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న మొదటి ఏడాది మహిళా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.కోటక్​ మహీంద్రా గ్రూప్​, కోటక్​ ఎడ్యూకేషన్​ ఫౌండేషన్​, బడ్డీ ఫర్​ స్టడీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఇందుకు అనర్హులు.అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు

ఇంటర్​ మార్క్​షీట్ ​

తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం

విద్యార్థిని చదువుతున్న కోర్సు ఫీజు వివరాలు

బోనఫైడ్​ సర్టిఫికెట్​ 

కాలేజీ సీట్ అలాట్​మెంట్​ లెటర్

​ప్రవేశ పరీక్ష స్కోర్​ కార్డ్

​ఆధార్ కార్డ్  

పాస్​బుక్​

పాస్​పోర్ట్ సైజ్​ ఫొటో

వైకల్యం ఉంటే సర్టిఫికెట్​డెత్​ సర్టిఫికెట్​(తల్లి లేదా తండ్రి మరణిస్తే)ఇంటి ఫొటోలు

దరఖాస్తు విధానం

ఈ స్కాలర్​షిప్​నకు అప్లై చేయాలనుకునే బాలికలు ఈ https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#scholarships 

లింక్​పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Buddy4Study పేజ్​లో మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్​ అవ్వాల్సి ఉంటుంది.

లాగిన్ అయ్యాక ఆన్​లైన్ అప్లికేషన్ ఫామ్​ పేజీ కనిపిస్తుంది.

వెంటనే Kotak Kanya Scholarship 2024-25 కు సంబంధించిన పేజీకి వెళ్తుంది.

అక్కడ స్టార్ట్​​ అప్లికేషన్​ బటన్​పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.

అనంతరం పత్రాలను అప్​లోడ్ చేసి కింద ఉన్న నియమనిబంధనలు(టర్మ్స్ అండ్ కండీషన్స్​) అంగీకరించాలి

.ఆ తర్వాత ప్రివ్యూపై క్లిక్ చేసి వివరాలన్ని సరిగ్గా ఉన్నాయే లేదో చెక్ చేసుకుని సబ్మిట్​ కొట్టాలి.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top