జీఓ–117 పై అధ్యయనం చేయాలి
‘విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా హేతుబ ద్దీకరణ చేసే ఉత్తర్వు-117పై అధ్యయనం చేయాలి. దీనిపై విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లతో చర్చించి నివేదిక ఇవ్వాలి. ఆంగ్లంతోపాటు మాతృభాష తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్ల మాధ్యమం తెచ్చి ప్రోత్సహించింది తెదేపా ప్రభు త్వమే. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వాలి. ఎవ రైనా పాఠశాలల అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలి. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకోవాలి. రోజువారీ వ్యవహారాల
పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. డైట్ కళాశాలల్లో పెండింగ్ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. వీటికి నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. విద్యార్థు లకు ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 4,026 మంది విద్యార్థులకు గతంలో ప్రతిభ అవార్డులు ఇచ్చాం. వీటిని పునరుద్ధ రించాలి. బడుల్లో పని చేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు చెల్లించాలి' అని ముఖ్యమంత్రి ఆదేశించారు
0 comments:
Post a Comment