True Caller | ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు

కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్

తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

అయితే వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్ ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్ కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్లోని కాంటాక్ట్స్ తో పాటు కాల్ వివరాలను సదరు యాప్స్ చేరుతాయి.

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్ అసవరం లేకుండానే ఇకపై అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్ తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్ వివరాలు ఏ యాప్ అవసరం లేకుండా స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ట్రాయ్.. నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ ను యాక్టివేట్ చేయనుంది. జూలై 15వ తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్ ప్రారంభించనుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top