కూటమి ప్రభుత్వం వైసీపీలా చేయబోదని, తాము ఎలాంటి కోతలూ లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు
తాము ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం కింద ఇచ్చేందుకు త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఓ పండుగ వాతావరణంలోనే ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీ పేటెంట్ పొందిందని విమర్శించారు. 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబుల్ డిజిట్‌కు పడిపోయినప్పటికీ వైసీపీకి బుద్ధిరాలేదని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకుండానే వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టిందని నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని చెప్పారు. ఆమ్మఒడి అమలు చేస్తామని, ఇద్దరు పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పింది జగనేనని అన్నారు. తాము ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలుపెట్టారని చెప్పారు
వైసీపీ హయాంలో ఆమ్మఒడి పథకానికి వైసీపీ తూట్లు పొడిచిందని, ఇప్పుడు తమ తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని నిమ్మల రామానాయుడు అన్నారు. కాగా, అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదట 183 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment