Shiksha Saptah -4th day విద్యా వారోత్సవాలు.- Cultural day సాంస్కృతిక దినోత్సవం చేపట్టవలసిన కార్యక్రమాలు

Shiksha Saptah -4th day  విద్యా వారోత్సవాలు.- Cultural day సాంస్కృతిక దినోత్సవం  చేపట్టవలసిన కార్యక్రమాలు

1. జాతీయ విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా ఆచరించడం మొదలై ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. దీనిని పురస్కరించుకుని శిక్షా సప్తాహ/విద్యా వారోత్సవాలు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డైట్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం 

2. విద్యలో ,కళా విద్యని ,సాంస్కృతిక విద్యని అంతర్భాగం చేయాలని జాతీయ విద్యా విధానం 2020 చెబుతోంది

2. 24 జులై 2024 న సాంస్కృతిక దినోత్సవం మనం అట్టహాసంగా జరుపుకోవాలి .

3. భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన లక్ష్యంగా కలిగిన మన భారతీయ సంస్కృతిని విద్యార్థినీ విద్యార్థులు అందరికీ తెలియజేయాలి. 

4. భావిభారత పౌరులుగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా భారతదేశాన్ని **ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్*గా* గుర్తించగలగాలి

5. ఈ సందర్భంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని వారి భాషని వేషధారణను ఆహార అలవాట్లను వృత్తి విద్యలను సంగీత సాహిత్యాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలి. 

6. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం *ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్* లో భాగంగా పంజాబ్ రాష్ట్ర పరస్పర సంస్కృతిలను తెలుసుకొని ఆచరించాలి.

7. కనుక భిన్నత్వంలో ఏకత్వం లో భాగంగా అన్ని రాష్ట్రాల సంస్కృతిల ప్రదర్శనలో పంజాబ్ రాష్ట్ర సంస్కృతి ప్రదర్శనకి  ప్రాధాన్యత ఇవ్వాలి

8. వివిధ భాషలు మాట్లాడేటట్టుగా పిల్లలని ప్రోత్సహించాలి. వారికి కాస్త సమయం ఇచ్చి ఒక పేరాగ్రాఫ్ ఇతర భాషలలో చదివేలా చేయాలి 

9. ఫ్యాన్సీ డ్రెస్ ,నృత్యాలు , ప్రముఖ దేశభక్తుల నాయకుల మోనో యాక్షన్ ని , వారు ఇచ్చిన నినాదాలని, వివిధ రాష్ట్రాల సంగీత సాహిత్య కళాకారుల ఫోటోల ప్రదర్శన, మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో వాటిని ప్రతిబింబించేలా ప్రదర్శన పాటలు ఆయా రాష్ట్రాల ఆహార పదార్థాలు తయారు చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సృజనాత్మకంగా నిర్వహించవచ్చు 

10. వివిధ రాష్ట్రాలలో ప్రముఖులుగా గుర్తించబడిన వారిని స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అనగానే టంగుటూరి ప్రకాశం పంతులుగారు పంజాబ్ అనగానే శ్రీ భగత్ సింగ్ ఇలాంటివారు మనకు గుర్తొస్తారు 

11. ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి తన రాష్ట్ర గానముంది ప్రతి రాష్ట్రం కి  ఆ రాష్ట్ర పక్షి ఆ రాష్ట్ర జంతువు ఆ రాష్ట్రం వృక్షము ఇవన్నీ కూడా విద్యార్థులకి పరిచయం చేయడానికి ప్రయత్నించండి. 

12. పిల్లలందరికీ అవకాశం ఇవ్వండి సమూహ నృత్యాలు ఒక పద్ధతిగా చేసేటట్టుగా వారికి అవకాశం కల్పించండి 

13. పిల్లలందరూ చక్కగా యూనిఫాంలో ఉండేటట్టుగా చూడండి 

14. *సినిమా పాటలు దయచేసి ఎక్కడ ఉపయోగించొద్దు* మిలే సుర్ మేరా తుమ్హారా అనే పాటని IFP లో పిల్లలకు వినిపించండి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగలను ఆచార వ్యవహారాలను వేష భాషను కూడా చూపించవచ్చు

15. రోజు లాగానే ఈ కార్యక్రమానికి కూడా తల్లిదండ్రులను సమాజ సభ్యులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించండి 

16. *ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో* భాగంగా భారతదేశ సంస్కృతిని అత్యున్నతమైనది అనే భావనని పిల్లల్లో కలిగించాలి 

17. భావిభారత పౌరులుగా *భిన్నత్వoలో ఏకత్వాన్ని స్వీకరించి* అవగాహన చేసుకుని అందరితో మమేకమైపోయి అన్ని సంస్కృతులను గౌరవించి జీవించగలిగిన సామర్ధ్యాల పచ్చ అవగాహన కలిగించాలి

18. *ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ని* నినాదంగా చేపట్టాలి

19. మన రాజ్యాంగంలోని *రాజ్యాంగ పీఠిక ను* చదివించి దాని అర్థాన్ని పిల్లలకు వివరించాలి 

20. ఈ సమాచారాన్ని అన్ని సమూహాలకి పంపించండి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top