కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన కార్మికుల పిల్లలకు 2024-25 ఏడాదికి గాను స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీడీ కార్మికులు, సినీ కార్మికులు, లైమ్‌స్టోన్, డోలోమైట్, మైకా, ఐరన్‌ఓర్, మాంసనీస్ ఓర్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లల నుంచి దరఖాస్తులు కోరారు. 1వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఇంటర్ నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. మరిన్ని వివరాలకు scholarships.gov.in వెబ్‌సైట్‌ను, 01206619540 హెల్ప్‌లైన్ నంబర్, helpdesk@nsp.gov.in కు మెయిల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
0 comments:
Post a Comment