PM Viswakarma Yojana: విశ్వకర్మ యోజన ఎవరి కోసం? అర్హతలేంటి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు ఇవి.

కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టింది. 2023, సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. పనిలో నాణ్యతను మెరుగుపరడానికి ఏకంగా దేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వారికి సులభంగా రుణాలిస్తూ.. అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ చేయూతనందిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టింది. 2023, సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. విశ్వ కర్మల పనిలో నాణ్యతను మెరుగుపరడానికి ఏకంగా దేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ పథక ఉద్దేశం ఏమిటి? అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి. తెలుసుకుందాం..

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే..

పీఎం విశ్వకర్మ యోజన అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. ఇది హస్త కళాకారులతో పాటు చేతి వృత్తిదారులకు మద్దతుగా ఏర్పాటు చేసింది. దీని ద్వారా సులభతర రుణాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తూనే డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఆధునిక మార్కెట్‌లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సమగ్ర మద్దతును అందిస్తూనే, దేశీయ, ప్రపంచ విలువ గొలుసులలో వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా ఈ చొరవ సాంకేతికతతో కళాకారులను సన్నద్ధం చేస్తుంది.

పీఎం విశ్వకర్మ యోజన అర్హత..

18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, అసంఘటిత రంగంలో కుటుంబ-కేంద్రీకృత సంప్రదాయ వ్యాపారాలలో నైపుణ్యం లేదా చేతివృత్తుల పనిలో నిమగ్నమై ఉన్నవారు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులుగా విశ్వకర్మ పథకం ద్వారా సహాయం పొందేందుకు అర్హులు. ప్రస్తుతం 18 ట్రేడ్‌లు పథకంలో భాగంగా ఉన్నాయి. అవి కార్పెంటర్, బోట్ మేకర్, ఆర్మర్, కమ్మరి, హామర్ అండ్ టూల్ కిట్ మేకర్, తాళాలు వేసేవారు, గోల్డ్ స్మిత్ (సోనార్), కుమ్మరి, శిల్పి (రాతి చెక్కేవారు), స్టోన్ బ్రేకర్, చెప్పులు కుట్టేవారు /పాదరక్షల కళాకారులు,మేసన్ (రాజ్‌మిస్ట్రీ), బాస్కెట్/చాప/చీపురు మేకర్/కొయిర్ నేత, డాల్ అండ్ టాయ్ మేకర్ (సంప్రదాయ), బార్బర్ (నాయి), గార్లాండ్ మేకర్ (మలకార్), వాషర్‌మన్ (ధోబి), టైలర్ (దర్జి), ఫిషింగ్ నెట్ మేకర్.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ప్రయోజనాలు..

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా, ప్రభుత్వం అధికారిక శిక్షణను అందిస్తుంది. సంప్రదాయ నైపుణ్యాలను పెంచుకోడానికి ఉపకరిస్తుంది. ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మార్కెట్ అనుసంధానానికి మార్గాలను రూపొందిస్తుంది. ఈ కళాకారులు వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అంతిమంగా, ఈ హస్తకళాకారుల స్థాయిని పెంచడానికి, వారికి స్థిరమైన జీవనోపాధి, వృద్ధికి అవసరమైన సాధనాలు, అవకాశాలను అందించడానికి ఈ పథకం ప్రయత్నిస్తుంది.

గుర్తింపు: హస్తకళాకారులు వారి సంబంధిత చేతివృత్తులలో వారి నైపుణ్యాన్ని గుర్తించి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డ్‌ను అందుకుంటారు.

టూల్‌కిట్ ప్రోత్సాహకం: స్కిల్ అసెస్‌మెంట్ తర్వాత, లబ్ధిదారులు వారి వాణిజ్యానికి ప్రత్యేకమైన ఆధునికీకరించిన సాధనాలతో రూపొందించబడిన రూ. 15,000 టూల్‌కిట్ ప్రోత్సాహకాన్ని అందుకుంటారు.

ప్రాథమిక శిక్షణ: విశ్వకర్మలకు రూ. 500/రోజు స్టైఫండ్‌తో 5-7 రోజుల ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఉంటుంది. ఈ సమగ్ర శిక్షణలో ఆధునిక సాధనాలు, డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు, వ్యవస్థాపకత, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్‌లు నేర్పిస్తారు.

అధునాతన శిక్షణ: ప్రాథమిక శిక్షణ తర్వాత, లబ్ధిదారులు రూ. 500/రోజు స్టైఫండ్‌తో 15 రోజుల పాటు అధునాతన నైపుణ్య శిక్షణను పొందవచ్చు. ఈ అధునాతన శిక్షణ తాజా సాంకేతికతలు, డిజైన్ అంశాలు, పరిశ్రమ భాగస్వాములతో అనుబంధాలను పెంపొందించడం ద్వారా స్వీయ-ఉపాధి నుంచి సంస్థలను స్థాపనకు మార్చడానికి వీలు కల్పిస్తుంది.

క్రెడిట్ మద్దతు: ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన తర్వాత, చేతివృత్తులవారు 18 నెలల రీపేమెంట్ వ్యవధితో రూ. 1 లక్ష వరకు పూచీకత్తు రహిత రుణాలకు అర్హులు అవుతారు.ప్రామాణిక రుణ ఖాతాను నిర్వహించడం, డిజిటల్ లావాదేవీలు చేయడం లేదా అధునాతన నైపుణ్య శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన లబ్ధిదారులు రూ. 2 లక్షల వరకు రెండో విడత రుణాలను పొందవచ్చు. అయితే, వారు తదుపరి రూ. 2 లక్షలను యాక్సెస్ చేయడానికి ముందు ప్రారంభ రూ. 1 లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం: లబ్ధిదారులు డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలను అందుకుంటారు. ప్రతి లావాదేవీకి రూ. 1, నెలవారీ 100 లావాదేవీలను ప్రోత్సహిస్తుంది.

మార్కెటింగ్ సహాయం: నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ఈ-కామర్స్, జీఈఎం ప్లాట్‌ఫారమ్ ఆన్‌బోర్డింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీలో కళాకారులు మార్కెట్‌లోకి చేరుకోవడానికి వీలుగా విస్తరించేలా సహాయం అందిస్తారు. అంతేకాక ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థలో వ్యాపార వేత్తలుగా ఉద్యామ్ అసిస్ట్ ప్లాట్ ఫాం లోకి లబ్ధిదారులను ఆన్ బోర్డు చేస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

వెబ్ సైట్: https://pmvishwakarma.gov.in/Home/HowToRegister వద్ద పీఎం విశ్వకర్మ పోర్టల్‌కి వెళ్లండి.

మొబైల్, ఆధార్ ధ్రువీకరణ: మీ మొబైల్ ప్రామాణీకరణ, ఆధార్ ఈకేవైసీ చేయండి.

ఆర్టిసన్ రిజిస్ట్రేషన్ ఫారమ్: రిజిస్ట్రేషన్ ఫారమ్ కోసం దరఖాస్తు చేయండి.

పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్: పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

స్కీమ్ కాంపోనెంట్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి: విభిన్న భాగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించండి

పీఎం విశ్వకర్మ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణతో కామన్ సర్వీస్ సెంటర్‌ల ద్వారా లబ్ధిదారుల నమోదు చేసుకోవచ్చు.

లబ్ధిదారుల నమోదు తర్వాత మూడు-దశల వెరిఫికేషన్ ఉంటుంది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top