03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) లో ఎంపిక అయిన విద్యార్థుల యొక్క మెరిట్ కార్డ్ లు విద్యార్థులకు అందుటలో జాప్యము జరుగుచున్న కారణంగా ఈ సంవత్సరం వెబ్ మెరిట్ కార్డ్ లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచడమైనది. కావున ఎంపిక అయిన విద్యార్ధులు వెంటనే వెబ్సైట్ నుండి వారి మెరిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరు మొదలగు వివరములు వారి ఆధార్ కార్డ్ పైన ఉన్న విధంగానే (ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా) ఉన్నవో లేదో తనిఖీ చేసుకుని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో ఈ సంవత్సరం ఆగస్టు 31 లోపు దరఖాస్తు సమర్పించి, సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా అప్రూవ్ చేయించుకొనవలెను. ముద్రించిన మెరిట్ కార్డ్ లను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపడం జరుగుతుంది. విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్ కార్డులో ముద్రించబడిన విధంగా మాత్రమే ఆధార్ కార్డ్ లో ఉండవలెను. వివరములు సరిపోలని విద్యార్థులు వెంటనే ఆధార్ mismatch వివరములు సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయవలెను. తప్పని సరిగా విద్యార్ధి ఆధార్ విద్యార్థి బ్యాంక్ ఖాతాకు సీడ్ కాబడి, DBT ద్వారా నగదు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment