ITR: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో.. ఈ విషయాలు దాస్తే రూ.10 లక్షల ఫైన్.. ఐటీ శాఖ హెచ్చరిక!

ITR: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. గడువు దగ్గర పడుతున్న కొద్ది చాలా మంది తమ రిటర్నులు ఫైల్ చేసేందుకు హడావుడి పడుతుంటారు. దీంతో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా, అన్ని వివరాలు సేకరించుకుని రిటర్నులు దాఖలు చేయాలి. ఆదాయ మార్గాలు వేరు వేరుగా ఉంటాయి. కొందరు ఇక్కేడ ఉండి ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లి సంపాదిస్తారు. ఇలా దేశంలో కొంతకాలం పాటు ఉండి విదేశాలకు వెళ్లి వారి సైతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒక్ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 182 రోజులు ఉంటే అతడిని రెసిడెంట్ ఇండియన్‌గా పరిగణిస్తారు. అందుకే వారి గ్లోబల్ ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇక్కడి ట్యాక్స్ రేట్లు వర్తిస్తాయి.



ఐటీ రిటర్నులు దాఖలు చేసేందకు గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హెచ్చరికలు చేసింది. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయం వంటి పూర్తి వివరాలను ఐటీ రిటర్నుల్లో పేర్కొనాలని స్పష్టం చేసింది. 'పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. విదేశాల్లో బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు, ఆదాయం కలిగి ఉన్న వారు అసెస్మెంట్ ఇయర్ 2024-25 కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఫారెన్ అసెట్ షెడ్యూల్ ఫిల్ చేయాలి. మీకు విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, ఆదాయం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి. ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు 31 జులై, 2024తో ముగియనుంది.' అని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top