Indian Navy 10+2 BTech Entry Scheme: ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి (జనవరి 2025 బ్యాచ్) నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జులై 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలలో 2024, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
వివరాలు..
* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్)
విభాగాలు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్.
ఖాళీలు: 40 (ఇందులో మహిళలకు 8 పోస్టులు కేటాయించారు)
కోర్సు ప్రారంభం: 2025 జనవరిలో.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో కనీసం 70 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. వీటితోపాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 02.07.2005 నుంచి 01.01.2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్)-2024 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలలో 2024, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
మెరిట్ లిస్ట్: సర్వీస్ సెలక్షన్ బోర్డు (SSB) అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తుంది. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్నట్లు తేలిన అభ్యర్థులు, పోలీస్ వెరిఫికేషన్, క్యారెక్టర్ వెరిఫికేషన్ & ఎంట్రీలో ఖాళీల లభ్యతకు లోబడి నియామకాలు చేపడతారు.
శిక్షణ: ఎంపికైన వారికి 2025 జనవరిలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. నేవల్ అవసరాలకు అనుగుణంగా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) వీరికి బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం నేవీలోనే ఉన్నత హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శిక్షణ సమయంలో పుస్తకాలు, రీడింగ్ మెటీరియల్‌తో సహా శిక్షణ మొత్తం ఖర్చును భారత నావికాదళం భరిస్తుంది. క్యాడెట్‌లకు అర్హత కలిగిన దుస్తులు, భోజన సదుపాయాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.07.2024
Download Complete Notification
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావాల్సిన వారు క్రింది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.....
https://chat.whatsapp.com/I17GmGdmpWyJjj19jCrB2g
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment