Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ (Indian Bank) గుడ్ న్యూస్ చెప్పింది. తమ శాఖలో ఖాళీగా ఉన్న 102 పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులను నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలని సూచించింది.
మొత్తం ఖాళీలు : 102
డిప్యూటీ వైస్ ప్రెసిడెండ్ పోస్టులు: 30
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెండ్ పోస్టులు: 72
విద్యా అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
విభాగాలు:
క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎంఈ, రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీ.
కనీస వయసు:
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 40 ఏళ్లు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కు 38 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ వేదికగా 2024 జులై 14 వరకూ దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్:https://www.indianbank.in/career/
0 comments:
Post a Comment