India Post GDS 2024: ఆంధ్రప్రదేశ్‌లో 1355 Post Office జాబ్స్‌.. 10th పాసైన వాళ్లు అర్హులు.. రాతపరీక్ష లేకుండా అభ్యర్థుల ఎంపిక

India Post GDS Recruitment 2024 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈనియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. అలాగే అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్ ఇదే.

మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందజేస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. అయితే.. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి

ముఖ్యమైన సమాచారం :

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.

వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీలు ఉన్న బ్రాంచీలు, హోదా, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వంటి వివరాలను నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2.. ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM): ఈ పోస్టుళకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. గ్రూప్‌ నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ABPM): ఈ పోస్టుల్లో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి

డాక్‌ సేవక్‌ (Dak Sevak): ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేది: జులై 15, 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5, 2024

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top