ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు చేయూతనందించేందుకు గాను ఉపకారవేతనాన్ని అందిస్తోంది. అర్హులైన ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
* ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024
అర్హత: ఐడీఎప్సీ ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థలో 2024 విద్యా సంవత్సరం రెండేళ్ల పూర్తి సమయం ఎంబీఏ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలు మించకూడదు.
ఉపకారవేతనం: ఏడాదికి రూ. లక్ష చొప్పున రెండేళ్లకు రూ.2 లక్షలు అందుతుంది. మొత్తం 350 మందిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: బ్యాంకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అడ్మిషన్ సంబంధిత ధ్రువీకరణ పత్రాలైన డిగ్రీ మార్క్స్ షీట్, ఆదాయ ధ్రువతపత్రం తదితరాలను అప్లోడ్ చేయాలి.
సందేహాలను నివృత్తి కోసం సంపాదించాల్సిన మెయిల్: mbascholarship@idfcfirstbank.com .
0 comments:
Post a Comment