Free Coaching for Group-1 Mains in BC Study Circle: తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TSBCESDTC) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జులై 9న ఒక ప్రకటనలో తెలిపారు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారికి 75 రోజులపాటు శిక్షణ ఇస్తారు. గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్‌తో కింద రూ.5,000 ఇస్తారు. బుక్‌ఫండ్, ట్రాన్స్‌పొర్టేషన్ ఖర్చులను ఇందులోనే ఇస్తారు.
మొత్తం సీట్లలో 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, ఈబీసీ& దివ్యాంగులకు 5 శాతం సీట్లను కేటాయిస్తారు. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో 75 రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. అభ్యర్థులు కుటుంబ ఆదాయ ధ్రువపత్రంతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు ఫోన్: 040- 24071178 లేదా 040-29303130 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావాల్సిన వారు క్రింది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.....
https://chat.whatsapp.com/I17GmGdmpWyJjj19jCrB2g
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment