ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డి.ఎస్.సి. పరీక్షకు కి హాజరు అయ్యే అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్.జి.ఎల్. ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ కే.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉమ్మడి విశాఖపట్నం ( విశాఖ, అనకాపల్లి, అల్లూరి) జిల్లాలకు చెందిన అర్హులైన వెనుకబడిన తరగతులు (బి.సి.), షెడ్యుల్ కులాలు (ఎస్.సి.), షెడ్యుల్ తెగలు (ఎస్.టి.) కులాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్.జి.ఎల్. ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్, కె.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. 200 మంది అభ్యర్ధులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ తో పాటు స్టైఫండ్ రూ. 3 వేలు రెండు నెలలకు , స్టడీ మెటీరియల్ (రూ.వెయ్యి) లు ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10 వ తరగతి మార్క్స్ లిస్టు, ఇంటర్ , డిగ్రీ మార్క్స్ లిస్టు, టి.టి.సి. టెట్ లో అర్హత సాధించిన మార్కుల జాబితా కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (తల్లిదండ్రుల వార్షిక అదాయము రూ.1 లక్ష లోపు మాత్రమే), ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకము జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు జతపరచి అభ్యర్ధులు ఈ నెల 8వ తేదీ లోగా ఈ క్రింది అడ్రస్ బి.సి. స్టడీ సర్కిల్, సెక్టార్-6, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మేడ పైన, ఎం.వి.పి. కాలనీ, విశాఖపట్నం 530017 కార్యాలయానికి నేరుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment