BSNL Strong Comeback: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మూలనపడ్డ సంస్థలు అప్పుడప్పుడు తెరుచుకుంటాయి. మూతపడుతాయనుకున్న సంస్థలు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తాయి.
నిన్నా మొన్నటి వరకు BSNL అంటేనే ఛీకొట్టిన మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు అదే BSNL వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీజన్ ఒక్కటే కాస్ట్ తగ్గింది.. కస్టమర్లు అట్రాక్ట్ అవుతున్నారు. సిగ్నల్, డేటా స్పీడ్ ఉండదన్న కారణంతో గతంలో BSNLఅంటేనే ఇష్టపడని కస్టమర్లు ఇప్పుడు మళ్లీ ఆ నెట్‌వర్క్‌కే తమ సిమ్‌లను పోర్ట్ చేసుకుంటున్నారు. లక్షల మంది కస్టమర్లు మళ్లీ BSNLను ఎంచుకుంటున్నారు. కొత్తగా BSNL సిమ్‌లు తీసుకునేవాళ్లు కొందరైతే.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి కన్వర్ట్ అవుతోన్న కస్టమర్లు లక్షలమంది ఉన్నారు.
దేశంలో BSNL తప్ప అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్‌లను పెంచాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు భారీగా రీచార్జ్ ప్లాన్లను పెంచేశాయి. పెరిగిన రేట్లు జులై 4నుంచి అమల్లోకి కూడా వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. దీంతో పబ్లిక్ నుంచి ఇమ్మీడియేట్ రియాక్షన్ వచ్చేస్తోంది
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ BSNLకు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ BSNLకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు టెలికాం రంగంలోకి అడుగుపెట్టడం, అట్రాక్టివ్ ప్లాన్స్‌తో ఆకట్టుకోవడంతో పాటు హైస్పీడ్ డేటా, మెరుగైన సిగ్నల్ రావడంతో కస్టమర్లు BSNLను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఈ మధ్యే టాప్ టెలికాం సంస్థలు అన్నీ రీచార్జ్ ప్లాన్ రేట్లను పెంచేయడంతో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
2 వారాల్లోనే 2 లక్షల మందికొత్త కస్టమర్లు
ఒకప్పుడు BSNLను వద్దనుకున్నవాళ్లే ఇప్పుడు మళ్లీ ఆ నెట్‌వర్కే కావాలంటున్నారు. దేశవ్యాప్తంగా 15రోజుల్లోనే లక్షల మంది తమ సిమ్‌లను BSNLకు పోర్ట్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో బయటికి వచ్చిన కొన్ని లెక్కలు అయితే షాక్‌కు గురి చేస్తున్నాయి. రెండు వారాల్లోనే దాదాపు 2 లక్షల మంది కస్టమర్లు BSNLకు పోర్ట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా BSNL ఆఫీసులన్నీ బిజీ అయిపోయాయి. ప్రతి రోజు వందలమంది కస్టమర్లు BSNLఆఫీసులకు క్యూకడుతున్నారు.
రోజుకు వంద SMSలు ఫ్రీ
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ప్లాన్ల రేట్లు చాలా పెరిగాయి. ఇంతకముందు ఉన్నదానికంటే దాదాపు 26 శాతం ధరలు పెంచేశారు. దాంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు.. తక్కువ ధరలకు లభించే ప్లాన్ల కోసం చూస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL లోకాస్ట్ ప్లాన్ తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ రేటు రూ.249. దీని ద్వారా BSNL మనీ సేవ్ చెయ్యడమే కాకుండా.. కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు ఉంది. ఇది ఇతర మామూలు ప్లాన్ల కంటే ఎక్కువే. ఈ ప్లాన్ ద్వారా ఇండియాలో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలు ఉంది. రోజుకు 2GB చొప్పున 45 రోజులకు 90 GB వస్తుంది. అలాగే రోజుకు వంద SMSలు ఫ్రీగా వస్తాయి.
BSNL ప్లాన్‌తో డబుల్ డేటా బెనిఫిట్స్
BSNL తెచ్చిన రూ.249 రేటుతో ఎయిర్‌టెల్‌లో కూడా ఓ ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులే. పైగా రోజూ వన్ GB డేటా మాత్రమే వస్తోంది. దాంతో పోల్చితే.. BSNLప్లాన్‌తో డబుల్ డేటా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 28 రోజుల బదులు అదనంగా 17 రోజులు సర్వీస్ పొందొచ్చు. ఇలా ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు ప్లాన్ల ధరలు పెంచుతూ పోతుంటే, BSNL మాత్రం తక్కువ కాస్ట్‌తో ప్లాన్లను కంటిన్యూ చేస్తోంది. అయితే ప్రచారం తక్కువగా ఉండటంతో చాలామంది ప్రైవేట్ సర్వీసులను వాడుకుంటున్నారు.
ఆగస్టులో దేశవ్యాప్తంగా 4G సేవలు
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ నెట్వర్క్ల కొత్త ధరలతో పోల్చితే.. BSNL నెట్ వర్క్ ఛార్జీలు ఏడాదికి 5 వందల నుంచి 6 వందల రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. కొన్ని BSNL ప్లాన్లతో అయితే ఏడాది రీఛార్జ్‌కు 7వందల రూపాయల వరకు భారం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇయర్ ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకునే మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు BSNL వైపు చూస్తున్నారు. BSNL కూడా ఈ సిచ్యవేషన్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తమ రీఛార్జ్ ప్లాన్లను ప్రచారం చేస్తోంది. BSNL ఇప్పటికే 2G, 3G నెట్‌వర్క్‌పై పని చేస్తోంది. దాని 4G సేవలు దేశంలోని కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా తన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా భావిస్తోంది BSNL.
0 comments:
Post a Comment