AP Open SSC Admissions 2024 last date APOSS 10th Class APOSS SSC Results 2024 APOSS Online fee payment APOSS SSC supplementary Results 2024 AP Open School Hall Ticket 2024 People also search for Ap open school ssc and SSC fees AP Open SSC Admissions 2024 AP Open School Results 2024
పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేని బాల బాలికలకు మరియు వయోజనులకు విద్యను అందించుటకై దేశంలోనే ప్రప్రథమంగా 1991వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం A.P. Open School దూర విద్యా విధానాన్ని ప్రారంభించింది. 2008-09 విద్యా సంవత్సరంలో ఈ విధానం ద్వారా నూతనంగా SSC కోర్సును ప్రవేశ పెట్టింది.
ప్రభుత్వ ఉత్తర్వుల జి.ఓ.ఆర్.టి.నెం. 723, పాఠశాల విద్యా శాఖ (బడ్జెట్-ఎస్.ఎస్.ఎ.) తేది : 27-9-2008 ప్రకారం, ఓపెన్ స్కూల్ వారి పదవ తరగతి పాన్ సర్టిఫికెట్ పాఠశాలల 10వ తరగతికి సమానం. ఈ సర్టిఫికెట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికెట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది. ప్రవేశ అర్హతలు : చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి SSC లో ఫెయిల్ అయిన వారికి, మరియు 14 సంవత్సరములు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలిగి ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికి ఆగష్టు 31, 2024 నాటికి 14 సంవత్సరములు నిండిన వారందరూ అర్హులే. గరిష్ఠ వయో పరిమితి లేదు. బోధనా విషయాల (Subjects) ఎంపిక: ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు రెండు గ్రూపులుగా విభజింపబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా వారికి నచ్చిన బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.
గ్రూప్ 'ఎ' - భాషలు
గ్రూప్ 'బి'- మెయిన్ సబ్జెక్టులు (భాషేతర విషయాలు)
బోధనా మాధ్యమం (Medium of Instruction) ఎంపిక: తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మరియు ఒరియా మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.
కోర్సు కాల వ్యవధి: ఒక్క సంవత్సరము.ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి ఐదు సంవత్సరములు. ప్రవేశం పొందిన తరువాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు పరీక్ష వ్రాసే అవకాశం.
క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం: అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టులలో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు. ఒకటి కాని అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కాని వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును. నిర్ణీత 5 సంవత్సరాలలో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. సంవత్సరంలో రెండు పర్యాయములు అనగా మార్చి/ఏప్రియల్ మరియు జూన్/జులైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి. మార్కుల బదలాయింపు (TOC) దేశంలోని గుర్తింపబడిన బోర్డులలో 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ, అట్టి వారు పాసైన రెండు సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత 5 సం॥లలోపు పాసై ఉండాలి.
ప్రవేశ రుసుము :
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.100/- (అందరికీ)
అడ్మిషన్ ఫీజు : జనరల్ కేటగిరి పురుషులకు రూ.1300/-
ఇతరులు : అనగా మహిళలు, SC, ST, BC, మైనారిటీలు, దివ్యాంగులు (CWSN),ట్రాన్స్ జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు రూ.900/-
గమనిక: షన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలెను.
పరీక్షా రుసుము : ప్రతి సబ్జెక్టుకు రూ.100/-
గమనిక: దివ్యాంగ (CWSN) విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు.
Download Completed Notification
0 comments:
Post a Comment