AP Open Inter Admissions 2024 last date APOSS Inter APOSS Inter Results 2024 APOSS Online fee payment APOSS Inter supplementary Results 2024 AP Open School Hall Ticket 2024 People also search forAp open school Inter and inter fees AP Open Inter Admissions 2024 AP Open School Results 2024
ఓపెన్ స్కూల్ ద్వారా SSC లో ఉత్తీర్ణులైన వారితో పాటు పాఠశాలల్లో SSC పూర్తి చేసి వివిధ కారణాల వలన ఇంటర్మీడియట్ చదవలేక పోయిన వారికి, కళాశాల చదువు మానివేసిన వారికి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారికొరకు సార్వత్రిక విద్యావిధానంలో ఇంటర్మీడియట్ కోర్సు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును 2010-11 లో ప్రారంభించింది.
G.O.Ms.No.170, Higher Education (I.E.II) Dept., dated: 4-9-2010 ప్రకారం, ఓపెన్ స్కూల్ వారి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ కళాశాలల ఇంటర్మీడియటు సమానం. ఈ సర్టిఫికెట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికెట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది.
ప్రవేశ అర్హతలు: 10వ తరగతి పూర్తి చేసి, ఆగష్టు 31, 2024 నాటికి 15 సంవత్సరములు నిండిన వారందరికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం. ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా APOSS ద్వారా పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.
బోధనా విషయాల (Subjects) ఎంపిక: ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు రెండు గ్రూపులుగా విభజింపబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.
గ్రూప్ 'ఎ' - భాషలు
గ్రూప్ 'బి' - మెయిన్ సబ్జెక్టులు (భాషేతర విషయాలు)
(Medium of Instruction):
తెలుగు, ఇంగ్లీషు మరియు ఉర్దూ మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సు కాల వ్యవధి: ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత కొరకు SSC ఉత్తీర్ణత సాధించిన నాటి నుండి రెండు సంవత్సరములు అంతరం ఉండాలి.
ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి: ఐదు సంవత్సరములు. ప్రవేశం పొందిన తరువాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు పరీక్ష వ్రాసే అవకాశం.
క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం: అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టులలో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు. ఒకటి కాని అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కాని వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును. నిర్ణీత 5 సంవత్సరాలలో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకొన్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. సంవత్సరంలో రెండు పర్యాయములు అనగా మార్చి / ఏప్రియల్ మరియు జూన్ / జులైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి.
మార్కుల బదలాయింపు (TOC): దేశంలోని గుర్తింపబడిన బోర్డులలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికీ, అట్టి వారు పాసైన రెండు సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత 5 సంవత్సరాలలోపు పాసై ఉండాలి.
ప్రవేశ రుసుము :
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.200/- (అందరికీ)
అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులకు రూ.1400/-
ఇతరులు : అనగా మహిళలు, SC, ST, BC, మైనారిటీలు, దివ్యాంగులు (CWSN), ట్రాన్సో జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు రూ.1100/-
గమనిక : అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలెను.
పరీక్షారుసుము :
ప్రతి సబ్జెక్టుకు రూ.150/- మరియు ప్రాక్టికల్స్ కలిగిన ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ.100/-
గమనిక: దివ్యాంగ (CWSN) విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు.
AP Onen School 2024 Inter Notification
0 comments:
Post a Comment