395 రోజుల వ్యాలిడిటీతో BSNL సరికొత్త ప్లాన్‌ - ధర, ప్రయోజనాలివే! - BSNL 395 Days Plan

 BSNL Plan :ప్రభుత్వరంగ టెలికాం సంస్థబీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)కస్టమర్లను ఆకర్షించేందుకు 395 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్​ను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైన బీఎస్ఎన్​ఎల్​, కొత్త యూజర్లను ఆకర్షించేందుకే ఈ 13 నెలల ప్లాన్​ను లాంఛ్ చేసింది.జియో, ఎయిర్​టెల్ మొదలైన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్​లను పెంచిన నేపథ్యంలో, చాలా మంది యూజర్లు ఇప్పుడు బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్లపై దృష్టి సారిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకుని, తాజాగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్​ను బీఎస్​ఎన్​ఎల్ తీసుకువచ్చింది. మరెందుకు ఆలస్యం ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL 395 Days Plan Benefits :

వ్యాలిడిటీ - 395 రోజులుడేటా - రోజుకు 2జీబీఎస్​ఎంఎస్​లు - రోజుకు 100అపరిమిత కాలింగ్‌దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌హర్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, గేమ్‌ఆన్‌ ఆస్ట్రోటెల్‌ప్లాన్‌ ధర రూ.2,399

BSNL 365 Days Plan Benefits

బీఎస్​ఎన్​ఎల్​ 365 రోజుల (ఒక సంవత్సరం) వ్యాలిడిటీతో మరొక ప్లాన్​ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ పరిమితి లేకుండా 600 జీబీ డేటాను అందిస్తోంది. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఉంటాయి. అపరిమిత కాలింగ్‌ సౌలభ్యం ఉంటుంది. ఈ ప్లాన్​లోనూ జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, హర్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, గేమ్‌ఆన్‌ ఆస్ట్రోటెల్‌ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.రిలయన్స్​ జియో తమ మొబైల్‌ సేవల టారిఫ్‌లను 12-27 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్‌ తమ మొబైల్ సేవల టారిఫ్‌లను 10-21 శాతం వరకు పెంచింది. వొడాఫోన్‌ ఐడియా కూడా తమ మొబైల్‌ టారిఫ్‌లను జులై 4 నుంచి 11-24 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే పలువురు యూజర్లు తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించేందుకు బీఎస్​ఎన్​ఎల్​ కొత్తగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్​ను తీసుకువచ్చింది.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top