చల్లపల్లి మండలం పాగోలులో ఉన్న ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు
ఈ ఏడాది 6,7 తరగతుల్లో చేరే ఆసక్తి కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. తద్వారా ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులను డే స్కాలర్సుగా 6,7 తరగతుల్లో ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కావున అర్హత కలిగిన విద్యార్థిని, విద్యార్థులు సకాలంలో వచ్చి పరీక్షకు హాజరు కావాలని కోరారు.
0 comments:
Post a Comment