Jio: రోజుకు 2 జీబీ డేటా, ఏడాది వ్యాలిడిటీ.. జియో నుంచి సూపర్ రీఛార్జ్ ప్లాన్

 టెలికం కంపెనీ రియలన్స్‌ జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఛార్జీలు అందరికీ అందుబాటులోకి రావడం. అపరమిత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం.

అయితే ప్రతీ నెల రీఛార్జ్‌ చేసుకోవడం కూడా ఇప్పుడు ఒక సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణంగా నెలవారీ రీఛార్జ్‌ చేసుకుంటే 28 నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్‌ అందుబాటులో ఉంటున్నాయి.

దీంతో 12 నెలలకు గాను ఏటా 13 సార్లు రీఛార్జ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి చెక్‌ పెట్టేందుకే ఇయర్లీ ప్లాన్స్‌ను జియో ప్రవేశపెడుతోంది. యూజర్లను ఈ దిశగా అట్రాక్ట్‌ చేస్తోంది. నెలనెల రీఛార్జ్‌ చేసుకునే కంటే ఏడాదికి ఒకసారి రీఛార్జ్‌ చేసే దిశగా అలవాటు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 3227 ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఇంతకీ ఈ ప్లాన్‌తో ఏయే బెనిఫిట్స్‌ పొందొచ్చు లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీకు రోజు 2 జీడీ డేటా కోరుకునే వారైతే 28 రోజుల వ్యాలిడిటీ కోసం రూ. 398 రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాదంతా ఇదే ప్లాన్‌ను కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఏడాదికి రూ. 5,174 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇదే బెనిఫిట్స్‌తో జియో రూ. 3227 ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో మీరు ఏడాదికిరూ.1947 ఆదా చేసుకోవచ్చు.

రూ. 3227 రీఛార్జ్‌ ప్లాన్‌ బెనిఫిట్స్‌ విషయానికొస్తే ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 2 జీబీ ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ లభిస్తుంది. వీటితో పాటు ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ ఉచితం 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు సైతం లభిస్తాయి. ఇక వీటికి అదనంగా జియో టీవీ, జియో , జియో సెక్యూరిటీ, జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top