* గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4 .41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అధికారులు ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు సమాచారం. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం గురువారం ఉండవల్లి చేరుకుంటారు
0 comments:
Post a Comment