పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)... 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు, సీట్ల వివరాలు:
1. బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్లు): 93 సీట్లు (మహిళా అభ్యర్థులకు మాత్రమే)
అర్హత: కనీసం 45% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
2. బీఎస్సీ నర్సింగ్(పోస్ట్- బేసిక్) రెండేళ్లు: 62 సీట్లు (కో-ఎడ్యుకేషన్)
అర్హత: కనీసం 50% మార్కులతో 10+2తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వ్ఫైరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి:
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా,
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.1200. ఇతరులకు రూ.1500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2024
కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 26.07.2024.
ఫలితాల వెల్లడి: 09.08.2024.
బీఎస్సీ నర్సింగ్(నాలుగేళ్లు) కౌన్సెలింగ్ తేదీ: 12.08.2024.
బీఎస్సీ నర్సింగ్(పోస్ట్ బేసిక్) కౌన్సెలింగ్ తేదీ: 14.08.2024.
Download Complete Notification
0 comments:
Post a Comment