ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవ్వడం ఎలా ? ఏం చదవాలి? అర్హతలేంటి,వేతనం ఎంత ఉంటుంది ?

మన నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ప్రతీ రోజూ వండుకుని తినేవి కొన్ని, మరి కొన్ని సందర్భాల్లో ప్యాక్ చేసిన ఆహారం తీసుకుంటాం. ఇంట్లో వంట చేసుకునే తినే ఆహారం మంచిదా, మార్కెట్‌లో దొరికే ఫుడ్ మంచిదా ?

అనే సందేహం వచ్చిందా. హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ మరియు దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో దొరికే ఫుడ్ ను ఎవరు చెక్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా ? ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేస్తుంటారు. ఫుడ్ సేప్టీ అధికారులు ఆహార పదార్థాల నాణ్యతను చెక్ చేస్తుంటారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అవ్వడం ఎలా ? కెరీర్ ఎలా ఉంటుంది? వారికి వేతనం ఎంత ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం !

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరు ?

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ...ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఆహారం యొక్క నాణ్యతను తనిఖీ చేసే వ్యక్తి. ఫుడ్ అనేది సేఫ్టీ మరియు హెల్తీగా చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అని చెక్ చేస్తారు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవ్వడం ఎలా?

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావడానికి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలు రాసి , అర్హత సాధించాల్సి ఉంటుంది.

అర్హతలు:

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావాలనుకునే అభ్యర్థులు కింది విభాగంలో తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి

కెమిస్ట్రీలో బీఈ లేదా బీటెక్

బయోకెమిస్ట్రీ

ఫుడ్ టెక్నాలజీ

ఫుడ్ సైన్స్

మైక్రోబయాలజీ

ఎడిబుల్ ఆయిల్ టెక్నాలజీ

ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ

కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/టాక్సికాలజీలో మాస్టర్స్ డిగ్రీ

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వయో పరిమితి

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వివిధ వర్గాలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష

భారతదేశంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు నిర్వహించే వివిధ పరీక్షలు ఉన్నాయి. అయితే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు రెండు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి, FCI (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మరియు FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీస్ ఆఫ్ ఇండియా). ఫుడ్ ఆఫీసర్లు కావాలనుకునే అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు రాసి, అర్హత సాధించాల్సి ఉంటుంది.

సర్టిఫికేషన్ కోర్సులు

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ అర్హతలకు వెయిటేజ్ యాడ్ చేసుకునేందుకు సర్టిఫికేషన్ కోర్సును చేయడం ఉత్తమం. సర్టిఫికేషన్ కోర్సులు చేయడం వల్ల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, మెరిట్ జాబితాకు ఉపయోగపడతాయి.

కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు:

ఆహార చట్టాలు మరియు ప్రమాణాలు

ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక అంశాలు

ఫుడ్ మైక్రోబయాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ

గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ

ఆ తర్వాత అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ FCI, FSSAI మరియు అనేక ఇతర ప్రైవేట్ సంస్థల ద్వారా జరుగుతుంది. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు మెడికల్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూతో పూర్తిచేసిన తర్వాత అభ్యర్థులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల వేతనం:

జూనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రారంభ వేతనం సుమారుగా 25వేలు ఉంటుంది, సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రారంభ వేతనం సుమారుగా 48వేలుగా ఉంటుంది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top