AP DSC-2024 BC STUDY CIRCLE FREE COACHING.... PRESS NOTE

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు DSC (ANDHRA PRADESH DISTRICT SELECTION COMMITTEE- 2024), SGTs(Secondary Grade Teachers) 2 స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీసర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్. టి. ఆర్ జిల్లా సంచాలకులు కుమారి ఈ. కిరణ్మయి గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దీని కొరకు ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన బి.సి, ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్థులు అర్హులు. అర్హత కల అభ్యర్ధులు తమ దరఖాస్తులను బి.సి స్టడీ సర్కిల్ నందు పొంది తమ బయోడేటాతో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రములు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టి.సి) మరియు 10వ తరగతి, ఇంటర్ మార్కుల లిస్టుల యొక్క జిరాక్సులను దరఖాస్తుకు జతపరచవలెను.దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది. 29-06-2024. ఉచిత శిక్షణ 60 రోజుల పాటు ఉంటుందని, ఉచిత శిక్షణతో పాటు స్టయిపెండ్ మరియు స్టడీ మెటీరీయల్ ఇవ్వడం జరుగుతుంది.

అభ్యర్ధుల ఎంపిక మెరిట్ ప్రాతిపదికన జరుగును. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు విజయవాడ, బి.సి. స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించబడును.. ఎంపికైన అభ్యర్ధులు తమ ఒరిజినల్ టి.సి. కుల ఆదాయ ధృవీకరణ పత్రములు(తమ తల్లిదండ్రుల వార్షిక ఆదాయమురు.1,00,000/-కు మించరాదు) మార్కుల సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టి.సి) కార్యలయమునందు సమర్పించవలెను. శిక్షణా కాలము పూర్తీ అయిన పిదప అభ్యర్ధులకు స్టయిపెండ్ మంజూరు చేయబడును. ఇతర వివరముల కొరకు బి.సి.స్టడీ సర్కిల్ నందు సంప్రదించగలరు. సదరు శిక్షణా అవకాశమును బి.సి, ఎస్.సి. ఎస్.టి. అభ్యర్ధులు వినియోగించు కోవలసినదిగా కోరడమైనిది

వివరాలకు సంప్రదించవలసిన మా చిరునామా

ఎ .పి.బి.సి.స్టడీ సర్కిల్

Door No:74-2-1/5

అశోకనగర్, డోర్ నెం: 74-2-1/5,

పండరిపురం, రోడ్డు నెం 8, విజయవాడ-520011

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9505094349,7981448836

AP DSC Material డీఎస్సీకి ప్రిపరేషన్ కు కావలసిన పూర్తి మెటీరియల్ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు

DSC 2024 Complete Study Material





Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top