Pradhan Mantri Suraksha Bima Yojana: ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు జీవిత బీమా తీసుకుంటున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించి జరగరానిది జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని అందరూ పాలసీ తీసుకుంటున్నారు. ఉద్యోగులు, ఆదాయం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించి పెద్ద పెద్ద పాలసీలు తీసుకుంటారు. అయితే దేశంలోని పేదలు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా అతి తక్కువ ధరకే జీవిత బీమా పాలసీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అదే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.
పీఎంఎస్ బీవై ని కొన్ని సవంత్సరాల క్రితమే కేంద్రం ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించి రూ. 2 లక్షల బీమా కవరేజీ పొందవచ్చు. పాలసీదారుడు అకాల మరణం చెందినా, యాక్సిడెంట్ లో వైకల్యం పొందినా కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు అందుతాయి.
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు వారు ఈ ప్రభుత్వ జీవిత బీమా పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. సంవత్సరానికి రూ. 20 ప్రీమియం చెల్లించాలి. మీ బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డిడక్ట్ అవుతుంది. మీ సంబంధింత బ్యాంకు శాఖలో లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ పాలసీని పొందవచ్చు.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనను కేంద్రం 2015 లోనే ప్రారంభించింది. మొదట ప్రీమియం రూ. 12 గానే ఉంది. అయితే 2022 జూన్ 1 నుంచి ప్రీమియను రూ. 20 కి పెంచారు. దేశంలో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలందరికీ జీవిత బీమా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
0 comments:
Post a Comment