మలివయసులో నెలానెలా 10వేల పెన్షన్.. అందుబాటులో అద్భుత స్కీం ..

 యవ్వనం ఉన్నంతసేపు సంపాదన బాగానే ఉంటుంది. ఈ క్రమంలో చేసిన కష్టమంతా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలుకే సరిపోతుంది.మలి వయసులో ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎలాంటి ఆదాయం ఉండదు.

ఈ సమయంలో ఇతరులపై ఆధారపడితే వారికి భారంగా ఉంటుంది. అందువల్ల ముందుగానే పెన్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల అవసరాలకు సరిపడా ఆదాయం ఉంటుంది. అయితే 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ ప్లాన్ ను సెట్ చేసుకోవడం మంచిది. ఎల్ ఐసీ నుంచి ఉన్న ఓ పథకంలో 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే 13వ సంవత్సరం నుంచి నెలనెలా రూ.10 వేల ఆదాయం వస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

సాధారణంగా భవిష్యత్ అవసరాల కోసం చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నారు. వీటిలో కొన్ని రిటర్న్ తో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి పథకమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కొత్త స్కీంను తీసుకొచ్చింది. అదే జీవన్ శాంతి. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. 12 సంవత్సరాలు ఆగిన తరువాత 13 వ సంవత్సరం నుంచి పెన్షన్ పొందుతారు. ఒకేసారి వీలు కాకపోతే మూడు నెలలు, లేదా ఆరు నెలలు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న ఓ వ్యక్తి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టారనుకేంటే.. 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆ తరువాత 13వ సంవత్సరం నాటికి వడ్డీ రూ.1.32,920 అవుతుంది. ఈ మొత్తాన్ని నెలకు ఎంచుకుంటే రూ.10 వేలకు పైగా చేతికి వస్తుంది. అయితే పాలసీదారుడు ఆ సమయానికి ఉన్నా, లేకున్నా.. ఈ స్కీం వర్తిస్తుంది. ఒకవేళ పాలసీదారుడికి ఏమైనా అయితే నామినిలు ఇలా నెలనెలా వద్దనుకుంటే ఒకేసారి చాలా బెనిఫిట్స్ తో కలిపి పొందవచ్చు.

ఇక పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం నెలనెల రూ.10 వేలు పొందవచ్చు. అయితే దీని కోసం కొత్త ప్లాన్ ను ఎంచుకోవాలి. ఇదే కాకుండా జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ను కోరుకుంటే పాలసీదారుడితో పాటు లైఫ్ పార్ట్ నర్ కు కూడా పెన్షన్ వస్తుంది. దీంతో ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఒకేసారి పెట్టుబడులు పెట్టొచ్చు. లేదా వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top