భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలసీలు రూపొందిస్తుంటుంది. ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. అందుకే దేశంలో మెజారిటీ ప్రజలకు కచ్చితంగా ఒక ఎల్ఐసీ పాలసీ అయినా ఉంటుంది. అయితే ఎల్ఐసీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ పథకాన్ని రూపొందించింది. దీని పేరు ఎల్ఐసీ ఆధార్ శిల. మరి ఈ ప్లాన్ వివరాలు ఏంటి, రిటర్నులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ ఆధార్ శిల స్కీమ్ ద్వారా మహిళలు రోజుకు రూ. 29 పెట్టుబడి పెడితే 20 ఏళ్ల తర్వాత రూ. 4 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఓ 30 ఏళ్ల మహిళ రోజుకు రూ. 29 పెట్టుబడి పెడితే మొదటి ఏడాదికి 4.5 వడ్డీ కలిపితే రూ. 10,959 అవుతుంది. ఇలానే దీర్ఖకాలం పాటు కొనసాగిస్తే ఏటా రూ. 10 వేలకు పైగా చెల్లిస్తే పాలసీ మెచూర్ అయ్యే నాటికి రూ. 4 లక్షల వరకు రిటర్నులు పొందవచ్చు.
* ఎల్ఐసీ జీవన్ శిలా స్కీమ్ లో మహిళలు కనీసం రూ. 75,000 నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచూరిటీ టైం 10 ఏళ్లు లేదా 20 ఏళ్లు ఉంటుంది.
* పాలసీ పూర్తయ్యే నాటికి మహిళల వయసు 70 ఏళ్లు దాటకూడదు.
* పాలసీదారులు తమకు అనుకూలంగా నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా సంవత్సరానికి ఓసారి ప్రీమియం చెల్లించవచ్చు.
* 8 ఏళ్ల బాలికల నుంచి నుంచి 55 ఏళ్ల మహిళ వరకు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ స్కీమ్ చక్కని ఎంపిక అని చెప్పవచ్చు.
* ఈ పాలసీ తీసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి.
పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్ల లోపు పాలసీదారులు మరణిస్తే కుటుంబసభ్యులకు సమ్ అస్యూర్డ్ అమౌంట్ ఇస్తారు. అంటే మీరు రూ. 3 లక్షల పాలసీ తీసుకుంటే ఆ మొత్తాన్ని కుటంబసభ్యులకు ఎల్ఐసీ అందజేస్తుంది.
* ఒకవేళ పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత పాలసీదారులు మరణిస్తే సమ్ అస్యూర్డ్ అమౌంట్ తో పాటు లాయల్టీని అదనంగా కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది ఎల్ఐసీ.
* ఒకవేళ మీకు మధ్యలో లోన్ కావాల్సి వస్తే మీరు అప్పటివరకు కట్టిన ప్రీమియం అమౌంట్ నుంచి 70 శాతం వరకు లోన్ గా మంజూరు చేస్తారు. దీనికి బ్యాంకులతో పోల్చితే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది.
0 comments:
Post a Comment