Investment Ideas: ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పెట్టుబడిదారులు ఎస్ఐపీల రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా పెట్టే పెట్టుబడి దీర్ఘకాలంలో భారీ నిధుల సమీకరణకు పెట్టుబడిదారులకు దోహదపడుతుంది. ప్రతి నెల కేవలం రూ.5,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మిలియనీర్ కావచ్చు.
ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటారు. పొదుపు చేసిన డబ్బును సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా ప్రజలు తన కలలను నెరవేర్చుకుంటారు. లక్ష్యాలను సాధించటానికి SIP పెట్టుబడి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ పెట్టుబడిపై బలమైన రాబడి లభిస్తుంది. మిలియనీర్ కావాలనే మీ కలను నెరవేర్చుకోవడానికి మీరు ప్రతి నెలా కేవలం రూ.5,400ను 20 ఏళ్ల పాటు ఎస్ఐపీ రూపంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే ఈ పద్ధతిని దీర్ఘకాలం పాటు కొనసాగించటం పెట్టుబడిదారులను ధనవంతులుగా మారుస్తుంది
పెట్టుబడిదారులు ప్రతి నెలా రూ.5,400 సిప్ చేయటం ద్వారా ఏడాదికి రూ.64,800, 20 ఏళ్ల కాలంలో రూ.12,96,000 పెట్టుబడిగా డిపాజిట్ చేస్తారు. ఈ మెుత్తంపై 12 శాతం రాబడిని పొందినట్లయితే సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం ఇన్వెస్టర్ సంపద రూ.53,95,399 అవుతుంది. ఇక్కడ ఇన్వెస్టర్ తమ పెట్టుబడి మెుత్తాన్ని ఏడాదికి 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోయినట్లయితే 20 ఏళ్లలో పెట్టుబడిదారులు రూ.కోటి కంటే ఎక్కువ రాబడిని అందుకుంటారు.
స్టెప్-అప్ SIP ప్రయోజనాలు: SIPలో ఈ పెట్టుబడి ప్రక్రియను స్టెప్-అప్ SIP అని కూడా పిలుస్తారు. ఇది మీ పెట్టుబడి మొత్తాన్ని సంవత్సరానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. పెట్టుబడి మొత్తంలో ఈ పెరుగుదలతో ఇన్వెస్టర్ చేసే డిపాజిట్ కూడా పెరుగుతుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి 2024 ఏప్రిల్‌లో మొదటిసారిగా 20,000 కోట్ల రూపాయలు దాటడం గమనార్హం
0 comments:
Post a Comment