అమెరికా అధ్యక్షుడు కొలువైయుండే వైట్‌హౌస్( White House )లో భారత జాతీయ గేయం 'సారే జహాసే అచ్చా ' మారుమోగింది. వివరాల్లోకి వెళితే .. అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి వార్షిక ''ఆసియా అమెరికన్, నేటివ్ హవాయి అండ్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏఎన్‌హెచ్‌పీఐ) హెరిటేజ్ మంత్‌ను జరుపుకుంది.
ఈ సందర్భంగా అనేకమంది ఆసియా అమెరికన్ల ముందు వైట్‌హౌస్ మెరైన్ బ్యాండ్ సోమవారం ''సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా''ను వాయించింది. అంతేకాదు.. ఇండో అమెరికన్ల విజ్ఞప్తి మేరకు దీనిని రెండుసార్లు వాయించడం విశేషం.
ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా పీటీఐతో మాట్లాడుతూ.. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్( Heritage ) నెల కావడంతో తాను వైట్‌హౌస్‌కు హాజరయ్యానని తెలిపారు.
ఈ నేపథ్యంలో ''సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా '' వాయిస్తూ సంగీత విద్వాంసులు తనను పలకరించారని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఇది గర్వించదగ్గ క్షణమని.. తాను వారితో కలిసి పాడానని, మరోసారి ప్లే చేయాల్సిందిగా అభ్యర్ధించానని అజయ్ అన్నారు. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ నెలలో ఈ పాటను ప్లే చేయడం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden)అతని బృందం భారత్-అమెరికా సంబంధాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చెప్పవచ్చన్నారు.
కాగా.. శ్వేతసౌధంలో భారత దేశభక్తి గీతాన్ని ప్లే చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక యూఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని వాయించారు. మోడీ అమెరికా రావడానికి ముందే మెరైన్ బ్యాండ్ ఈ గేయాన్ని ప్రాక్టీస్ చేసింది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో స్పూర్తిని రగిలించేందుకు నాడు కవులు, కళాకారులు ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ ఇక్బాల్ ( Mohammad Iqbal )''సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా '' అనే గేయాన్ని రాశారు. ఇది నాడు ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు దేశభక్తిని రగిలించింది. మహమ్మద్ ఇక్బాల్ అవిభక్త భారతదేశంలోని సియాల్‌కోట్ ( ప్రస్తుతం పాకిస్తాన్‌లో వుంది)లో జన్మించారు. పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా కూడా ఇయనదే
0 comments:
Post a Comment