రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్.సురేష్ కుమార్, ఏపీఆర్ఐసీ సొసైటీ కార్యదర్శి నరసింహారావు తదితరులు మంగళవారం (మే 14న) విడుదల చేశారు. ఏప్రిల్ 25న ఈ పరీక్షలు నిర్వహించగా తాజాగా ఒకేసారి ఫలితాలను విడుదల చేశారు. మార్కులు, రిజర్వేషన్, స్పెషల్కేటగిరీ, స్థానికత ఆధారంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ క్యాండిడేట్వడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఏపీ ఆర్ జేసీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
aprje పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో; APRDC పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్ఇయర్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఐదో తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 6,7,8 తరగతుల్లో మిగిలివున్న సీట్లను భర్తీ చేయనున్నారు.
ఏపీ ఆర్ఎస్ ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
రెసిడెన్సియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే, జూనియర్ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు 49,308 మంది, నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 963 మంది చొప్పున విద్యార్థులు హాజరైనట్లు అధికారులు. వెల్లడించారు.
ఏపీఆర్ఎస్ 6,7,8వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
AP RDC ఫలితాలు కోసం క్లిక్ చేయండి
0 comments:
Post a Comment