ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్మీడయట్ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్ పేరిట 'సరోజిని దామోదరన్ ఫౌండేషన్' ఉపకారవేతనాలు అందజేస్తోంది. ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024
అర్హత: కనీసం 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం
ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్షిప్: ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండేళ్లకు మొత్తం రూ.20 వేల స్కాలర్షిప్ అందుతుంది.
ఇంటర్వ్యూ/ పరీక్షల తేదీలు:
దరఖాస్ చేయడానికి ఆఖరి తేదీ: 07.05.24
ఆన్లైన్ పరీక్ష తేదీ: 23.06.24
Download Complete Notification
0 comments:
Post a Comment