UPSC Calendar 2025: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2025లో నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఈ క్యాలెండర్‌లో 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించే పరీక్షల తేదీలు ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జనవరి 22న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) నోటిఫికేషన్ వెలువడనుంది. మే 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 22 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. వీటితోపాటు ఇంజినీరింగ్ సర్వీసెస్, ఎన్డీఏ & ఎన్‌ఏ (1) ఎగ్జామ్, ఎన్డీఏ & ఎన్‌ఏ (2) ఎగ్జామ్, సీడీఎస్ పరీక్ష(1) ఎగ్జామ్, సీడీఎస్ పరీక్ష(2) ఎగ్జామ్, కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్, ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎగ్జామ్-2025, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామ్, సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామ్, తదితర పరీక్షలు నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ 2025లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్..
1) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025
నోటిఫికేషన్: 22.01.2025.
దరఖాస్తు గడువు: 11.02.2025.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 25.05.2025.
మెయిన్స్ పరీక్ష తేదీ: 22.08.2025 నుంచి 5 రోజులపాటు నిర్వహిస్తారు.
2) యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీసె ఎగ్జామ్-2025
నోటిఫికేషన్: 22.01.2025.
దరఖాస్తు గడువు: 11.02.2025.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 25.05.2025.
మెయిన్స్ పరీక్ష తేదీ: 16.11.2025 నుంచి 7 రోజులపాటు నిర్వహిస్తారు.
3) ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(1)
నోటిఫికేషన్: 11.12.2024
దరఖాస్తు గడువు: 31.12.2024
పరీక్ష తేదీ: 13.04.2025
4) ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(2)
నోటిఫికేషన్: 28.05.2025
దరఖాస్తు గడువు: 317.06.2025
పరీక్ష తేదీ: 14.09.2025
5) ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమ్స్) ఎగ్జామ్
పరీక్ష తేదీ: 22.06.2025
6) ఇంజినీరింగ్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామ్
నోటిఫికేషన్: 18.09.2024
దరఖాస్తు గడువు: 08.10.2024
పరీక్ష తేదీ: 09.02.2025
7) కంబైన్డ్ జియో-సైంటిస్ట్(ప్రిలిమ్స్)
నోటిఫికేషన్: 04.09.2024
దరఖాస్తు గడువు: 24.09.2024
పరీక్ష తేదీ: 09.02.2025
8) సీఐఎస్‌ఎఫ్ ఏసీ(ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ
నోటిఫికేషన్: 04.12.2024
దరఖాస్తు గడువు: 24.12.2024
పరీక్ష తేదీ: 09.03.2025
9) ఐఈఎస్/ ఐఎస్‌ఎస్ ఎగ్జామ్
నోటిఫికేషన్: 12.02.2025
దరఖాస్తు గడువు: 04.03.2025
పరీక్ష తేదీ: 20.06.2025
10) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్
నోటిఫికేషన్: 19.02.2025
దరఖాస్తు గడువు: 11.03.2025
పరీక్ష తేదీ: 20.07.2025
11) సీఏపీఎఫ్(ఏసీ) ఎగ్జామ్
నోటిఫికేషన్: 05.03.2025
దరఖాస్తు గడువు: 25.03.2025
పరీక్ష తేదీ: 03.08.2025
12) ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(2)
నోటిఫికేషన్: 28.05.2025
దరఖాస్తు గడువు: 17.06.2025
పరీక్ష తేదీ: 14.09.2025
13) ఎస్‌వో/ స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ
నోటిఫికేషన్: 17.09.2025
దరఖాస్తు గడువు: 07.10.2025
పరీక్ష తేదీ: 13.12.2025
0 comments:
Post a Comment