APGLI ఆంధ్రప్రదేశ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసులన్నీ ఆన్లైన్ చేపడుతూ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ ఉత్తర్వులు ప్రకారం ఇకనుండి APGLI ద్వారా అందించి అన్ని సర్వీస్లన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అందించబడతాయి.
APGLI అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటన
పాలసీదారుల ప్రయోజనాల రీత్యా APGLI సేవలను క్రమబద్ధీకరించి, పాలసీ వివరాలు, స్వీకరించిన చందాలు, తీసుకున్న లోన్ వంటి వివరాలు అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ (https://nidhi.apcfss.in) ఉద్యోగుల లాగిన్లో అందుబాటులో ఉంచడమైనది. ముద్రించిన ప్రతులు DDO ద్వారా అందజేయబడును. ఉద్యోగుల పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించవలసిందిగా అభ్యర్థించడమైనది. ఏవైనా వ్యత్యాసాలు వున్నట్లయితే, 30-04-2024లోగా, పరిశీలన మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలతో dir_ccell_apgli@ap.gov.in మెయిల్ ద్వారా APGLI కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. గడువులోగా అందనిచో సదరు డేటాను ఖచ్చితమైనదిగా భావించబడును.
APGLI డేటా చెక్ చేసుకోలేని వారి పరిస్థితి ఏమిటి?
ఇలా చెక్ చేసుకోలేని వారి సౌకర్యార్థం ట్రెజరీ శాఖ వారు మన డి డి వో ద్వారా APGLI వివరాలన్నీ ప్రతి చందాదారుడికి అందించబడుతున్నాయి ఆ వివరాలన్నీ మనం చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెజరీ అధికారులు అందించిన వాటిలో సమాచారం సంపూర్తిగా ఉంటే సరిపోతుంది
ట్రెజరీ అధికారులు అందించే సమాచారంలో క్రింది సమాచారం ఉంటుంది
బాండ్లవారీగా నెలవారీ ప్రిమియంలు, పాలసీ ప్రారంభ తేదీ, మెచ్యూరిటీ తేదీ లతో పాటు సంవత్సరాల వారీగా ఏయే నెలలు మిస్సింగ్ క్రెడిట్ లు ఉన్నాయో మున్నగు సమచారం తెలుపబడినవి
0 comments:
Post a Comment