ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పర్సనల్ అసిస్టెంట్: 323 పోస్టులు (యూఆర్- 132,ఈడబ్ల్యూ ఎస్- 32, ఓబీసీ- 87, ఎస్సీ- 48, ఎస్టీలకు 24 కేటాయించారు)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి
వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు; గరిష్టంగా యూఆర్/ ఈడబ్ల్యూఎస్లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 28-03-2024 నుంచి 03-04-2024 వరకు.
0 comments:
Post a Comment