DSC 2024 Schedule Change | డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు

DSC Schedule Change DSC Exam Schedule AP DSC Notification Details DSC Schedule DSC Time Table 

• ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు

• హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూలు మార్పు

• పాఠశాల విద్య కమిషనర్ వెల్లడి

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభు త్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూ లును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిష నర్ ఎస్. సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రక టనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపా ధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడు దల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూ ల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందిం చామని సురేష్కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండ టంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవ డంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థు లు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయ మిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు..

  1. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకం డరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.
  2. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇం గ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
  3. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వ హిస్తారు.
  4. మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు.
  5. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ -టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేప థ్యంలో గతంలో ప్రకటించిన జీఓ-11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ-22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను https://apdsc.apcfss.in/  చూసుకోవచ్చునని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top