గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం ముఖ్యాంశాలు

విద్యాశాఖ మంత్రి గారితో సమావేశ వివరాలు

విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం సమగ్ర శిక్ష నందు జరిగింది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా 27 సార్లు ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో చర్చించిన అంశాలు.



1)పదోన్నతులు, నియామకాలకు ఒకే విధమైన విద్యార్హతలు ఉండాలని కోరగా పరిశీలన చేస్తామన్నారు.

2)కొత్తగా ఇచ్చిన పురపాలక సర్వీసు రూల్స్ మేరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరగా జీవో 117 నిబంధనల ప్రకారం చేపట్టుటకు ప్రభుత్వం ఫైల్ రన్ చేస్తామన్నారు.

3)MEO 1,2 లకు సమాన అధికారాలు ఇవ్వాలని, MEO 1 ఖాళీలు 161 భర్తీ చేయాలని కోరగా భర్తీ చేస్తామని, విద్యా సం౹౹ పూర్తి అయిన తరువాత రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.

4)పాఠశాల నిర్వహణ నిధులు గత సం౹౹ 50 శాతం మాత్రమే ఇవ్వగా, ఈ సం౹౹ అసలు ఇవ్వలేదు అని తెలుపగా నిధులు మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు.

5)కరెంటు బిల్స్ కట్టనవసరం లేదని తెలిపారు.

6)ప్లస్ టు పాఠశాలలల్లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను పిజిటిలుగా పిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరగా చేస్తామని తెలిపారు.

6)స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్య ఖాళీ పోస్టులను డీ-రిజర్వ్ చేసి పదోన్నతులు ఇవ్వాలని కోరగా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.

7)పండిత పదోన్నతులు చేపట్టాలని కోరగా కోర్టులో కేసు ఉపసంహరించుకుంటే వెంటనే చేపడతామని చెప్పారు. అవసరమైతే 100కు పైగా పోస్టులు కొత్తగా క్రియేట్ చేస్తామన్నారు.

8)2008 డిఎస్సీ ఎంటిఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని కోరగా సానుకూలత చూపలేదు.

9)ప్లస్ టు పాఠశాలల్లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఎఫ్.ఆర్ 22(బి) ప్రకారం వేతన స్థిరీకరణకు అవకాశం ఇవ్వాలని కోరగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు.

10)కారుణ్య నియామకాలు జిల్లా యూనిట్ గా చేపట్టాలని కోరగా పరిశీలిస్తామని తెలిపారు.

11)2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పై సానుకూలంగా ఉన్నామన్నారు.

12)మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల విషయంలో గుర్తింపు లేని ఆస్పత్రుల్లో చికిత్సను ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అనుమతించడం లేదని, మంజూరైన బిల్లులు సిఎస్సీ ఉత్తర్వులు లేవని ట్రెజరీ లలో అనుమతించడంలేదని తెలుపగా డిటిఏ గారి ద్వారా అనుమతింపచస్తామన్నారు.

13)అంతర్ జిల్లా బదిలీల కొరకు మార్చి 31 తర్వాత ఉత్తర్వులు ఇస్తామన్నారు.

14)సిపిఎస్ ఉద్యమంలో ఉపాధ్యాయులపై పెట్టిన చార్జషీట్లు, బైండోవర్ కేసులు ఉపసంహరింపచేస్తామన్నారు.

15)ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

16)జీవో 117ను సవరించి అన్ని పాఠశాలలకు హెచ్.ఎం, ఎస్.ఏ(పిఇ) పోస్టులు వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామన్నారు.

17)అర్బన్ డిఐ పోస్ట్ ఎంఇఓ-1 గా మారిన సందర్భంలో ఏర్పడిన జీతాల సమస్య పరిష్కారం కొరకు డిటిఏ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

18)1వ తరగతి ప్రవేశానికి 6సం౹౹లు కాకుండా 5సం౹౹లు కొనసాగిస్తామన్నారు.

19)నెలవారీ పదోన్నతులు చేపడతామని చెప్పారు.

20)డిప్యూటీ ఇఓ 55 ఖాళీలను హెచ్.ఎం/ఎంఇఓ జడ్పీ/ప్రభుత్వ కామన్ సీనియారిటీ ప్రాతిపదికన చేపడతామని చెప్పారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top