ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్ఎస్ క్యాట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అర్హులైన ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ, పీహెచ్సీ తదితర కేటగిరీ విద్యార్థులు మార్చి 31వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీఆర్ఎస్ క్యాట్-2024) : 5, 6, 7, 8.
ఏపీ గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 3,920.
ఏపీ గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 575.
అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్ష మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రశ్నపత్రం ఓమ్మార్ షీట్ విధానంలో రెండు గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.
హాల్ టికెట్ జారీ తేదీ: 17.04.2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.
ఫలితాల ప్రకటన, మొదటి ఎంపిక జాబితా వెల్లడి తేదీ: 14.05.2024.
రెండో ఎంపిక జాబితా వెల్లడి తేదీ: 21.05.2024.
Download Complete Notification
0 comments:
Post a Comment