కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ

కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, మరియు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం, ఆన్లైన్లో దరఖాస్తులు తేదీ 12.03.2024 నుండి తేదీ 11.04.2024 వరకు దరఖాస్తులు కోరడమైనది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద ఎస్.టి, బిసి, మైనారిటీ బి.పి. ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా స్వీకరించబడుతాయి. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. మరిన్ని వివరాలకు RTE Toll Free No 18004258599 5 0 శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్ష ఇరవై వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్షా నలభై వేలు మించకూడదు.




Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top