తెలంగాణ ప్రభుత్వం(TS Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని(TS Medical Helath Department Jobs) 5,348 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది.
మార్చిన 16వ తేదీనే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్, అర్హతకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ జారీచేయనున్నారు.
పోస్టుల వివరాలు ఇలా
హెచ్ ఆఫ్ డిపార్ట్మెంట్ -3235
వైద్య విధాన పరిషత్ -1255
పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్- 575
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్- 11
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -34 పోస్టులు
రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ పోస్టుల భర్తీకి ఇంకా అధికారిక నోటిఫికేషన్(Jobs Notification) రావాల్సి ఉంది.
0 comments:
Post a Comment