Free Sewing Machine : మీకు 'ఉచిత కుట్టు మిషన్ పథకం' గురించి తెలుసా ? ఈ పథకాన్ని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది.
ఈ పథకం ద్వారా కుట్టుమిషన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ ద్వారా కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 ఇస్తుంది. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఆ డబ్బుతో మీరు కుట్టు మిషన్ కొనాలి. దీనికితోడు కేంద్రం అదనంగా రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తుంది. ఈ డబ్బుతో కుట్టు మిషన్ షాపును పెట్టుకోవచ్చు. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం(Free Sewing Machine) కోసం అప్లై చేసుకోవచ్చు.దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఉచిత కుట్టు యంత్రం పథకం దరఖాస్తుదారు అన్ని ముఖ్యమైన పత్రాలనూ కలిగి ఉండటం అవసరం. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్ పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగి ఉండాలి. దీన్ని అప్లై చేయడానికి తొలుత అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in లోకి లాగిన్ కావాలి. వివరాలన్నీ నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కుదరదు అనుకుంటే దగ్గర్లోని CSC కేంద్రానికి వెళ్లి అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి అవసరమైన పత్రాలన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తు చేశాక.. మీకు ఒక రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఏప్రిల్‌లో మీరు కుట్టు మిషన్ పొందేందుకు డబ్బు వస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.
0 comments:
Post a Comment